ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ లో టాప్ లేపిన RRR..!

Update: 2022-03-28 15:35 GMT
రామ్ చరణ్ - ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ''ఆర్.ఆర్.ఆర్'' సినిమా మొదటి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. దేశ విదేశాల్లోనూ అద్భుతమైన కలెక్షన్స్ అందుకుంటున్న ఈ మల్టీస్టారర్ మూవీ.. ఫస్ట్ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా 470 కోట్ల గ్రాస్ తో 281 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను వసూలు చేసిందని నివేదికలు వెల్లడించారు.

మార్చి 25 - 27 వారాంతంలో వరల్డ్ బాక్సాఫీస్ వద్ద 'బాట్ మ్యాన్' కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి RRR మూవీ టాప్ ప్లేస్ లో నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లో ఈ సినిమా వసూళ్ళు బలంగా ఉన్నాయి. యూఏస్ఏలో ప్రీమియర్స్ మరియు వారాంతం కలెక్షన్స్ కలిపి $ 9.45 మిలియన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక నార్త్ ఇండియా - తమిళనాడు మరియు కేరళలో ఓపెనింగ్ డే కంటే ఆదివారం ఎక్కువ వసూళ్లను నమోదు చేసింది. దీంతో ఫస్ట్ వీకెండ్ లో అన్ని మార్కెట్లలో మంచి కలెక్షన్స్ సాధించింది.

'RRR' సినిమా వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. (నివేదికల ప్రకారం)

నైజాం – 53.50 కోట్లు
సీడెడ్ – 26.00 కోట్లు
యూఏ – 16.28 కోట్లు
నెల్లూరు – 4.81 కోట్లు
గుంటూరు – 11.47 కోట్లు
కృష్ణా – 8.18 కోట్లు
వెస్ట్ గోదావరి – 8.04 కోట్లు
ఈస్ట్ గోదావరి – 8.67 కోట్లు
AP/TS మొత్తం - 139. 90 కోట్లు (170 కోట్ల గ్రాస్)

కర్ణాటక – 20.75 కోట్లు
తమిళనాడు – 17 కోట్లు
కేరళ – 5.25 కోట్లు
హిందీ – 45 కోట్లు
ఓవర్సీస్ – 57 కోట్లు
మొత్తం (వరల్డ్ వైడ్) - 281.9 కోట్లు (రూ. 470.35 కోట్ల గ్రాస్)

ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారాంతంలో RRR సినిమా 281.9 కోట్ల షేర్ సాధించగా.. 470.35 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు నివేదికలు వెల్లడించాయి. రాబోయే రెండు వారాల వరకు చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి లేకపోవడం.. ఉగాది పండగ కూడా ఉండటంతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి.

కాగా, అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ పాత్రల స్పూర్తితో రాసుకున్న కల్పిత కథతో ''ఆర్.ఆర్.ఆర్'' చిత్రం తెరకెక్కింది. ఇందులో రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ అలరించారు. అలియా భట్ - అజయ్ దేవగన్ - ఒలివియా మోరిస్ - సముద్ర ఖని - శ్రియా - రే స్టీవెన్ సన్‌ - అలిసన్ డూడి కీలక పాత్రలు పోషించారు.

RRR చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌ తో నిర్మించారు. కేవీ విజయేంద్ర ప్రసాద్ కథ అందించగా.. బుర్రా సాయి మాధవ్ మాటలు రాశారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చూసుకున్నారు.
Tags:    

Similar News