బాలీవుడ్ లో దేవర 'పుష్ప' లా దూసుకుపోతుందే!
దీంతో బాలీవుడ్ లో ఎన్టీఆర్ డిమాండ్ ఇంతేనా? అన్న సందేహం తెరపైకి వచ్చింది.
పాన్ ఇండియా సినిమా గా రిలీజ్ అయిన 'పుష్ప' నార్త్ లో అనూహ్య వసూళ్లు సాధించింన సంగతి తెలిసిందే. రిలీజ్ రోజు సినిమాకి అక్కడ ఎలాంటి హైప్ లేదు. కానీ మౌత్ టాక్ తో అక్కడ ఆడియన్స్ లో ఒక్కసారిగా సినిమా వైరస్ లా పాకింది. దీంతో వసూళ్లు డే బై డే మరింతగా పెరిగాయి. బాలీవుడ్ నుంచే `పుష్ప` వసూళ్లు 100 కోట్లకు పైగానే రాబట్టింది. తాజాగా ఇదే వేవ్ లో దూసుకెళ్తోంది `దేవర`.
తొలి రోజు ఈ సినిమా 7 కోట్లకు పైగా ఓపెనింగ్స్ తెచ్చింది. దీంతో బాలీవుడ్ లో ఎన్టీఆర్ డిమాండ్ ఇంతేనా? అన్న సందేహం తెరపైకి వచ్చింది. అప్పటికే `ఆర్ ఆర్ ఆర్` తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు తారక్. అలాంటి హీరోకి ఇవేం ఓ పెనింగ్స్ అన్న విమర్శ వైరల్ అయింది. కానీ `దేవర` ఇప్పుడు బాలీవుడ్ ని వసూళ్లతో షేక్ చేసాలా కనిపిస్తుంది. పుష్ప తరహాలోనే దేవర వసూళ్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
ఇప్పటికే సినిమా 40 కోట్లకు పైగా వసూళ్లు హిందీ మార్కెట్ నుంచి రాబట్టినట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఈ సినిమా ఫుల్ రన్ లో 60 కోట్లకు పైగా రాబడుతుం దనే అంచనాలు మొదలయ్యాయి. ఈ లెక్క అంతకు పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గడానికి లేదంటున్నారు. దేవర అక్కడ ఎలాంటి ఆఫర్లు ప్రకటించకుం డానే ఈ రకమైన వసూళ్ల దిశగా దూసుకుపోవడం విశేషం.
ఈ నేపథ్యంలో దేవర వసూళ్లను బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సినిమా వసూళ్లతో ముడి పెట్టి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. కొంత కాలంగా అక్షయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోరాటం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో అతడి ఏ సినిమా కూడా 60 కోట్ల వసూళ్లకు దరి చేరలేదు. మొత్తం విడుదలైన సినిమా వసూళ్లలన్ని కలిపి లెక్కగట్టినా? 100 కోట్ల మార్క్ లో కనిపించలేదు. పుల్రన్ లో అతడి ఏ సినిమా కూడా 40 కోట్ల మార్క్ ని టచ్ చేయలేదు. దీంతో అక్షయ్ కుమార్ కంటే తారక్ అక్కడ ఎంతో మెరుగైన స్థానంలో కనిపిస్తున్నాడు.