అనుష్క చెవిలో హబ్బీ ఏం ఊదాడు?
అనుష్క- విరాట్ జంట అన్యోన్యదాంపత్యం అందరికీ ఆదర్శం.
అనుష్క- విరాట్ జంట అన్యోన్యదాంపత్యం అందరికీ ఆదర్శం. ఈ జంట ప్రేమ వ్యవహారం చాలా మందికి తెలియకపోవచ్చు కానీ వారి పెళ్లి గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇటలీలోని ఫ్లోరెన్స్‌లో ఈ జంట ఒకటయ్యారు. వివాహానికి సంబంధించిన చాలా ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి. విదేశాల్లో పెళ్లయ్యాక
భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వరుస విందు కార్యక్రమాలను నిర్వహించారు. వాటిలో ఒకటి ఢిల్లీలో స్టార్ స్టడెడ్ వెడ్డింగ్ రిసెప్షన్. ఈ సమయంలోనే భారతీయ క్రికెటర్ జానపద గాయకుడు గురుదాస్ మాన్ ఆటపాటలతో అలరిస్తుండగా, అనుష్క చెవిలో విరాట్ ఏదో చెప్పడం కనిపించింది. అది అతడు గురుదాస్ మాన్ పంజాబీ సాహిత్యాన్ని అనువదించి తనకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నాడు.
ఈ అందమైన జంట రిసెప్షన్‌లో ప్రదర్శన ఇచ్చేందుకు ఢిల్లీకి వెళ్లినప్పుడు వారి నుంచి తనకు లభించిన ప్రేమ, ఆప్యాయతలను గురుదాస్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. గురుదాస్ మాన్ విలక్షణమైన పంజాబీ సాహిత్యంతో పాటలు పాడటంలో స్పెషలిస్ట్. తాను పాడేప్పుడు క్రికెటర్ విరాట్ తన భార్య అనుష్క శర్మ చెవుల దగ్గరికి వెళ్లి వాటిని ఆమెకు అనువదించేవాడని, తద్వారా ఆమె కూడా ఆనందించిందని పేర్కొన్నాడు.
అదే ఇంటర్వ్యూలో విరాట్ ఇచ్చిన సర్ ప్రైజ్ గురించి గాయకుడు గురుదాస్ గుర్తు చేసుకున్నాడు. ఈ జంట ఈవెంట్‌కు ప్రతి ఒక్కరినీ ఆహ్వానించింది.. కానీ తనకు ఆహ్వానం అందనందున దూరంగా ఉన్నానని అతడు పేర్కొన్నాడు. విరాట్ నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ రోజు అతడు అందరినీ పిలిచాడు.. కానీ నాకు కాల్ చేయలేదు! అయితే అదంతా ప్లాన్డ్‌గా జరిగిందని నాకు తెలియదు అని కూడా తెలిపాడు. ఢిల్లీలో తాను ఎవరి ఈవెంట్‌లో ప్రదర్శన ఇస్తున్నానో ఎవరూ చెప్పలేదని గురుదాస్ మాన్ గుర్తు చేసుకున్నారు. గురుదాస్ మాన్ వేదిక వద్దకు చేరుకునే వరకు ఈ విషయాన్ని తనతో చెప్పవద్దని నిర్వాహకులకు ప్రత్యేకంగా సూచించారని తెలిపారు.
``విరాట్ నాకు కాల్ చేయలేదేమిటా అని నేను ఆలోచిస్తున్నాను.. నేను ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత నేను పాడటం ప్రారంభించాను!`` అని గాయకుడు గరుదాస్ అన్నారు. ఢిల్లీలో ఏదైనా ఈవెంట్‌లో ప్రదర్శన ఇచ్చినప్పుడల్లా, విరాట్ కోహ్లీ- అనుష్క శర్మల పెళ్లిలో తాను పాడిన పాటలనే పాడమని ప్రేక్షకులు తనను అభ్యర్థిస్తున్నారని కూడా అతడు తెలిపాడు. విరుష్క జంట ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. వారి పిల్లలు వామిక, అకాయ్‌లతో గడుపుతున్నారు.