ట్రిపుల్ ఆర్ కు నార్త్ ఇండియా జేజేలు

Update: 2022-03-28 17:30 GMT
మూడున్న‌రేళ్ల విరామం త‌రువాత థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన విజువ‌ల్ వండ‌ర్ ట్రిపుల్ ఆర్‌. ఈ మూవీ ఎప్పుడెప్పుడు థియేట‌ర్లలోకి వ‌చ్చేస్తుందా అని ఆశ‌గా ఎదురుచూశారు ప్రేక్ష‌కులు, అభిమానులు. ఆ రోజు రానే వ‌చ్చింది. మార్చి 25న ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది సినీ ప్రియులు ఎదురుచూసిన ట్రిపుల్ ఆర్ విడుద‌లైంది. విడుద‌లైన అన్ని చోట్ల అనూహ్య విజ‌యాన్ని సాధిస్తూ ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద నెవ‌ర్ బిఫోర్ ఎవ్వ‌ర్ ఆఫ్ట‌ర్ అనే స్థాయిలో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది.

దేశ వ్యాప్తంగా ఈ చిత్రానికి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. మ‌రీ ముఖ్యంగా నార్త్ ఆడియ‌న్స్ ట్రిపుల్ ఆర్ కు జేజేలు ప‌లుకుతున్నారు. అంతే కాకుండా ఈ చిత్రంలో అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టించిన రామ్ చ‌ర‌ణ్ పాత్ర‌కు కొత్త అర్థాన్ని చెబుతున్నారు. సినిమాలోని క్లైమాక్స్ స‌న్నివేశాల్లో కాషాయం ధ‌రించి విల్లు ఎక్కుపెట్టి బాణాలు వ‌దులుతూ తెల్ల‌వాళ్ల కి చుక్కులు చూపించిన స‌న్నివేశం చూసి రాముడిగా అభివ‌ర్ణిస్తున్నార‌ట‌.

అంతే కాకుండా బాలీవుడ్ - టీలీవుడ్ చిత్రాల్లోని హీరోల పాత్ర‌ల‌తో బాలీవుడ్ సినిమాల్లోని పాత్ర‌ల‌ని కంపేర్ చేస్తూ మీమ్స్ తో బాలీవుడ్ ని దారుణంగా కామెంట్ చేస్తుండ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ సినిమాల్లో హిందూ దేవ‌త‌ల‌ని కామెడియ‌న్ లుగా చిత్రీక‌రిస్తూ కామిక్ పాత్ర‌ల్లో చూపించారు. `పీకే` మూవీలో మ‌హా శివుడి గెట‌ప్ లో ఓ క‌మెడియ‌న్ ప‌రుగెడుతున్న‌ట్టుగా చూపించారు. `లూడో` చిత్రంలోనూ ఇదే త‌ర‌హాలో ముగ్గురు గాడ్స్ ని కామిక్ వేలో ప్ర‌జెంట్ చేశారు. ఇక `తాండ‌వ్‌` లోనూ శివుడి గెట‌ప్ ని మోడ్ర‌నైజ్ చేశారు.

కానీ అఖండ‌, బాహుబ‌లి, ట్రిపుల్ ఆర్ లో మాత్రం చాలా గొప్ప‌గా చూపించార‌ని మీమ్స్ ని ఉత్త‌రాది ప్రేక్ష‌కులు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు. ఇందులో ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యం ఏంటంటే ట్రిపుల్ ఆర్ లో చ‌ర‌ణ్ పోషించిన పాత్ర‌ని ఉత్త‌రాది ప్రేక్ష‌కులు రాముడుగా భావిస్తుండ‌టం. ప్ర‌స్తుతం ఇదే ఈ మూవీకి ఉత్త‌రాదిలో ప్ర‌ధాన ఎస్సెట్ గా మారింద‌ట‌. ఆ కార‌ణంగానే ఉత్త‌రాదిలో ఈ మూవీకి వీకెండ్ లోని శ‌ని, ఆదివారాలు క‌లెక్ష‌న్ లు బాగా పెరిగాయ‌ని చెబుతున్నారు. ఇది గ‌మ‌నించిన వారంతా ఉత్త‌రాదిలో రాజ‌మౌళి ట్రిక్ ఫ‌లించింద‌ని అంటున్నారు.
Tags:    

Similar News