RRR ను బీటౌన్ ప్రముఖులు పట్టించుకోవడం లేదేంటి..?

Update: 2022-03-29 02:30 GMT
'బాహుబలి' తర్వాత ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ''ఆర్.ఆర్.ఆర్'' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తొలి రోజునే 223 కోట్లు కొల్లగొట్టిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా.. ఫస్ట్ వీకెండ్ లో 500 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25 నుంచి 27 వరకు RRR చిత్రానికి 64 మిలియన్ డాలర్లు రాగా.. 'బ్యాట్ మ్యాన్' మూవీకి 45.5 మిలియన్ డాలర్లు - 'ది లాస్ట్ సిటీ' కి $34.7 డాలర్లు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

ఇక RRR సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటుగా యూఎస్ఏలో  సాలిడ్ కలెక్షన్స్ అందుకుంటోంది. తమిళం మరియు మలయాళ భాషల్లో వారాంతంలో వసూళ్ళు పెరిగాయి. ఇక హిందీలో మొదటి రోజు 19 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగా.. ఆ తర్వాత పుంజుకొని మూడు రోజుల్లో 74 కోట్లు రాబట్టింది.

అయితే 'ఆర్.ఆర్.ఆర్' సినిమా వరల్డ్ వైడ్ గా సత్తా చాటుతున్నా.. నార్త్ ఇండియాలో గట్టి ప్రభావం చూపిస్తున్నా బాలీవుడ్ ప్రముఖులు ఈ చిత్రాన్ని మెచ్చుకోవడం లేదు. హీరో వివేక్ ఒబేరాయ్ - దర్శక నిర్మాత కరణ్ జోహార్ వంటి ఇద్దరు ముగ్గురు మాత్రమే మాత్రమే సినిమా విజయాన్ని ప్రశంసింస్తూ.. చిత్ర బృందాన్ని అభినందించారు.

ట్రిపుల్ ఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ మరియు అలియా భట్ ముఖ్యమైన పాత్రలు పోషించారు.  నిడివి తక్కువే అయినా అజయ్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. సీతగా అలియా అలరించింది. కానీ రిలీజ్ తర్వాత వీరిద్దరూ కూడా సినిమా విజయం గురించి ఒక ట్వీట్ చేయలేదు.

గతంలో రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' చిత్రంలో హిందీ నటీనటులకు స్థానం లేదు. అయినా సరే బీటౌన్ జనాలు కూడా తమ వంతుగా ప్రమోట్ చేశారు. కానీ ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో ఇద్దరు పాపులర్ బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు. కానీ ఈ సినిమా సక్సెస్ గురించి నుండి ఎవరూ స్పందించకపోవడం.. ప్రచారం చేయకపోవడం టాలీవుడ్ జనాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

'బాహుబలి' కి ముందు బాలీవుడ్ మన సినిమాలను నటీనటులను చిన్న చూపు చూస్తారనే టాక్ ఉంది. కానీ దేశం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేశారు జక్కన్న. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా అంటున్నారంటే కారణం ఆయనే. ఎందుకనో ఇప్పుడు రాజమౌళి తీసిన RRR సినిమా గురించి మాత్రం బీటౌన్ ప్రముఖులు పట్టించుకోవడం లేదు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా ఫిక్షనల్ పీరియాడికల్ డ్రామాగా ''ఆర్.ఆర్.ఆర్'' మూవీ తెరకెక్కింది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మల్టీస్టారర్ ను నార్త్ లో పెన్ స్టూడియోస్ రిలీజ్ చేసింది. బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ నమోదు చేస్తుందో చూడాలి.
Tags:    

Similar News