దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ ''ఆర్.ఆర్.ఆర్'' కు ఆస్కార్ అవార్డ్ కు ఎంపిక కావాలంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో క్యాంపెయిన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అద్భుతమైన నటన కనబరిచిన ఎన్టీఆర్ - రామ్ చరణ్ లకు సినీ రంగంలో అత్యున్నతంగా భావించే అకాడమీ అవార్డ్స్ కు నామినేట్ అవుతారని అభిప్రాయ పడ్డారు.
RRR సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన తర్వాత గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో అనేక అంతర్జాతీయ మ్యాగజైన్స్ మరియు హాలీవుడ్ ఫిలిం మేకర్స్.. ప్రతిష్టాత్మక అవార్డుల కోసం ఇండియా నుండి ట్రిపుల్ సినిమా సరైన ఎంపిక అని పేర్కొనడంతో దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూసింది. అయితే అనూహ్యంగా 'ఆర్.ఆర్.ఆర్' ను కాదని.. భారతీయ సినిమా నుంచి 'ఛెలో' అనే గుజరాతీ చిత్రాన్ని ఆస్కార్-2022 కోసం అఫిషియల్ ఎంట్రీగా ఎంపిక చేసారు.
రాబోయే 95వ అకాడమీ అవార్డ్స్ లో అత్యుత్తమ అంతర్జాతీయ ఫీచర్ విభాగంలో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి పాన్ నలిన్ 'లాస్ట్ ఫిల్మ్ షో' (చెలో షో)ని ఎంపిక చేయడంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వస్తోంది. అత్యంత ప్రజాదరణ పొంది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన పీరియాడిక్ ఫిల్మ్ RRR ని పక్కన పెట్టడంపై సినీ అభిమానులు పూర్తిగా నిరాశ చెందారు. అయితే ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని విమర్శకులు విశ్లేషకులు అంటున్నారు.
వెరైటీ మ్యాగజైన్ కథనం ప్రకారం, RRR యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్.. ఈ ఫిక్షనల్ యాక్షన్ డ్రామా కోసం అవార్డుల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. 10,000 మంది అకాడమీ సభ్యులను ఈ చిత్రానికి అన్ని కేటగిరీలలో ఓటు వేయాలని పిలుపునిస్తున్నారని పేర్కొన్నారు.
ఉత్తమ చిత్రం - దర్శకుడు (S.S. రాజమౌళి) - ఒరిజినల్ స్క్రీన్ ప్లే (రాజమౌళి & విజయేంద్ర ప్రసాద్) - ఉత్తమ ప్రధాన నటుడు ( జూనియర్ ఎన్టీఆర్ & రామ్ చరణ్ ) - సహాయ నటుడు (అజయ్ దేవగన్) - సహాయ నటి (ఆలియా భట్) - ఒరిజినల్ సాంగ్ ('నాటు నాటు') - ఒరిజినల్ స్కోర్ (ఎంఎం కీరవాణి) - సినిమాటోగ్రఫీ - ప్రొడక్షన్ డిజైన్ - ఫిల్మ్ ఎడిటింగ్ - కాస్ట్యూమ్ డిజైన్ - మేకప్ హెయిర్ స్టైలింగ్ - సౌండ్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో “RRR” సమర్పించబడుతుందని వెరైటీ తెలిపింది.
'ఆర్.ఆర్.ఆర్' ఇంకా అకాడమీ స్ట్రీమింగ్ రూమ్ లో అందుబాటులో ఉంచలేదు. ఇది గ్రాండ్ స్కేల్ మరియు ఉత్కంఠభరితమైన విజువల్స్ ను హైలైట్ చేయడానికి.. పెద్ద స్క్రీన్ పై ఎక్కువ మంది చూసి ఓటేసేలా చూసేందుకు చేసే వ్యూహంలో భాగమని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్.ఆర్.ఆర్ సినిమా $140 మిలియన్లకు పైగా వసూలు చేసి భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా అవతరించడం చూశామని.. 14 వారాల పాటు ఒక ఇండియన్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో వరల్డ్ వైడ్ ట్రెండ్ అవడం చరిత్రలో మొదటిసారని RRR యూఏస్ డిస్ట్రిబ్యూటర్ తెలిపినట్లు నివేదించారు. ఈ ఏడాది వచ్చిన ఉత్తమ చిత్రాలలో RRR ఒకటని తాము నమ్ముతున్నామని.. అందుకే అన్ని కేటగిరీలలో ఈ చిత్రాన్ని పరిగణించాలని అకాడమీని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.
ఇకపోతే RRR చిత్రాన్ని ఆస్కార్ ఎంట్రీగా ఎంపిక చేయకపోవడంపై అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక పై అసంతృప్తిని వ్యక్తం చేయడానికి వారు ట్విట్టర్ ను వేదికగా చేసుకున్నారు. ప్రస్తుతానికి ఆర్‌ఆర్‌ఆర్ బృందం ఇంకా దీనిపై స్పందించలేదు. మరోవైపు ఇప్పటికీ జనరల్ కేటగిరీలో ఆస్కార్ రేసులోకి ప్రవేశించవచ్చని నివేదికలు చెబుతున్నాయి.
కాగా, 1920 బ్యాక్ డ్రాప్ లో ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కల్పిత కథను 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో చూపించారు. రామరాజు గా రామ్ చరణ్.. భీమ్ గా ఎన్టీఆర్ నటించారు. అజయ్ దేవగన్ - శ్రియా శరణ్ -అలియా భట్ మరియు సముద్రఖని తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.