భారీ ప్రమోషనల్ ఈవెంట్లతో RRR బృందం రిలీజ్ ముందు వేడి పెంచే ప్రయత్నంలో ఉంది. ఇంతకుముందు ముంబైలో ఈవెంట్ ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేదికకు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
నిజానికి దుబాయ్ లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సల్మాన్ ని ఆహ్వానించేందుకు రాజమౌళి వెళ్లి ముంబైలో ప్రత్యేకంగా అతడిని కలిసారు. కానీ కోవిడ్ కారణంగా ఈవెంట్ రద్దయింది. తరువాత ముంబైలో నిర్వహించారు. సల్మాన్ దీనికి హాజరయ్యారు. ఇప్పుడు అదే దుబాయ్ ఈవెంట్ హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ నెల 18న దుబాయ్ ఈవెంట్ ను ప్రత్యేకంగా నిర్వహించనున్నారని తెలిసింది. RRR మూవీని అట్టహాసంగా విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఈ దుబాయ్ ఈవెంట్ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాడు. ఇతర ఈవెంట్లతో పోలిక లేకుండా వైవిధ్యంగా చేయాలన్నది ప్లాన్. మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి
చిక్కబళ్లాపూర్ లోనూ ఈవెంట్..
దుబాయ్ ఈవెంట్ తో పాటు మరో ఈవెంట్ చర్చల్లోకొచ్చింది. ఈ నెల 19న బెంగుళూరులోని చిక్కబళ్లాపూర్ లో RRR ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఇప్పటికే తారక్ - చరణ్ అభిమానుల్లో దీనిపై ఆసక్తి నెలకొంది. ప్రీఈవెంట్ కోసం ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. రామ్ చరణ్ అభిమానులు చిక్కబల్లాపూర్ లోని సినిమా థియేటర్లలో `వినయ విధేయ రామ` విడుదల దినోత్సవ వేడుకలకు సంబంధించిన వీడియోలను పంచుకోవడం ఆసక్తికరం. అయితే చిక్కబల్లాపూర్ లో జరగనున్న RRR ఈవెంట్ లో చరణ్ అభిమానుల్ని పూర్తిగా డామినేట్ చేయాలని ఎన్టీఆర్ అభిమానులు ఉర్రూతలూగుతున్నాట. డిసెంబర్ లో బెంగళూరులో జరిగిన RRR ప్రమోషనల్ టూర్ లో తామే పూర్తిగా ఆధిపత్యం చెలాయించామని ఎన్టీఆర్ అభిమానుల్లో టాక్ వినిపించడం విశేషం. చరణ్ వేదికపైకి వెళుతుంటే జై ఎన్టీఆర్ నినాదాలు మిన్నంటిన సంగతి తెలిసినదే. మునుముందు ఈవెంట్లలోనూ తారక్ అభిమానులు ఇలానే చేస్తారట.
అయితే తన అభిమానుల్ని ఇలా చేయొద్దని చరణ్ చెబుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ - చరణ్ నడుమ స్నేహం గురించి తెలిసినదే. ఇదంతా ఫ్యాన్స్ మధ్య జోష్ అని భావించాలి. ఆర్.ఆర్.ఆర్ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25న పలు భాషల్లో అత్యంత భారీగా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే థియేటర్లను లాక్ చేసారు.
#RRR .. టికెట్ బుకింగుల్లో ఫ్యానిజం పీక్స్..!
ఫ్యాన్స్ ని హీరోలు ఎందుకని దేవుళ్లతో సమానంగా చూస్తారనడానికి నిదర్శనమిదే. హీరోలకు ఎనర్జీని ఇచ్చేదే ఫ్యాన్స్. తమపై కురిపించే అభిమానం చూసి అంతే బాధ్యతగా వ్యవహరిస్తూ గొప్ప ఔట్ పుట్ ఇచ్చేందుకు గొప్ప వినోదాన్ని అందించేందుకు హీరోలు సంసిద్ధంగా ఉంటారు. అందుకు తగ్గట్టే అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తూ బోలెడంత హైప్ తెస్తుంటారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్ గా ఆర్.ఆర్.ఆర్ కోసం వేచి చూస్తున్నారు. బుకింగ్ లు వేడెక్కిస్తున్నాయి.
తాజాగా RRR కోసం అమెరికాలో మరోసారి ముందస్తు బుకింగ్ ప్రారంభమైంది. దీనికి స్పందన ఎలా ఉంటుంది? అని ఎదురు చూస్తుండగా.. ఇప్పటికే దెబ్బతిన్న థియేటర్ వ్యాపారం కోసం వెల్ కమ్ షాంపైన్ వంటి వేల టిక్కెట్లు వెంటనే అమ్ముడయ్యాయి. మార్చి 24 ప్రీమియర్ ల నుండి భారీ సంఖ్యలో బిజినెస్ సాగుతోంది. విదేశాల్లోని ఈ హుషారు చూస్తుంటే.. ఇది భారతీయ థియేటర్ ల బుకింగ్ సామర్థ్యాన్ని పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. టెక్సాస్ - డల్లాస్ లోని గెలాక్సీ థియేటర్ లో జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని 75 టిక్కెట్ లను కొనుగోలు చేయడం ఇటీవల హాట్ టాపిక్ అయ్యింది.
అలాగే రామ్ చరణ్ అభిమానులు ఇప్పటికే భారీగా టికెట్లను బుక్ చేశారన్న గుసగుసలు ఉన్నాయి. తారక్- చరణ్ అభిమానుల సందడి మునుపటి కంటే ఊహించనంత వైబ్రేంట్ గా ఉండనుందని తాజా పరిణామం చెబుతోంది. టికెట్ కొనుగోలులోనూ ఫ్యాన్స్ నడుమ పోటీతత్వం కనిపిస్తోంది.
ఆర్.ఆర్.ఆర్ విడుదల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించిన సినిమాగా ఆర్.ఆర్.ఆర్ కి ఎంతో ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఇక పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తో ఆ ఇద్దరూ కలిసి రావడం అన్నది అన్ ఇమాజినబుల్. అందుకే ఆర్.ఆర్.ఆర్ కి ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ అంతటా ఉత్తరాదినా బలమైన మార్కెట్ ఏర్పడింది. అన్నిచోట్లా ప్రీ బుకింగులపై బోలెడన్ని అంచనాలున్నాయి. బలమైన ప్రీ-సేల్స్ బాక్సాఫీస్ వద్ద కొత్త ఫిగర్స్ తో ప్రారంభమవుతాయని తాజా సన్నివేశం చెబుతోంది.
తారక్ పెద్ద తెరపై కనిపించి దాదాపు నాలుగు సంవత్సరాలు అయ్యింది. చరణ్ నటించిన సక్సెస్ ఫుల్ సినిమా రంగస్థలం విడుదలై చాలా గ్యాప్ వచ్చింది. తదుపరి వినయ విధేయ రామా తీవ్రంగా నిరాశపరిచాక ఇప్పుడు `ఆచార్య` ఇంకా ఆలస్యమైంది. అందువల్ల చరణ్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఉన్నారు. రాజమౌళి ఫ్యాన్స్ ఈసారి విజువల్ మ్యాజిక్ ఏ రేంజులో ఉంటుందో అంటూ ఊహాగానాల్లో ఉన్నారు.