మెగా పవర్ స్టార్ చరణ్ -యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. ఈరెండు నెలల్లో అన్ని పనులు పూర్తిచేసి సంక్రాంతి కల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ రేయింబవళ్లు శ్రమిస్తోంది. ఇప్పటికే కరోనా కారణంగా బాగా ఆలస్యమైన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది ఆరంభంలో అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చేయాలని యూనిట్ గట్టిగా సంకల్పించి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రచార కార్యక్రమానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని దుబాయ్ లో గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారుట. యూనిట్ సహా సినిమాకు పనిచేసిన కీలక వ్యక్తులందర్ని దుబాయ్ కి తీసుకెళ్లాలని టీమ్ సన్నాహాలు చేస్తుందిట. మరి తెలుగు రాష్ర్టాల్ని వదిలేసి జక్కన్న దుబాయ్ మీద ఎందుకు పడ్డారు? అంటే చాలా సంగతులే ఉన్నాయి. ఇది పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కింది. కానీ దుబాయ్ లో ఈవెంట్ చేస్తే పాన్ వరల్డ్ కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు ఉన్నారు. అందులోనూ దుబాయ్ లాంటి అభివృద్ది చెందిన దేశంలో ఇలాంటి ఈవెంట్లు నిర్వహిస్తే ఆ రూపేణా టిక్కెట్ల రూపంలో భారీగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
అక్కడ తెలుగు సంఘాలు ఎన్నో ఉన్నాయి. ఎంత ఖరీదైన పెట్టి అయినా టిక్కెట్ కొని ఈవెంట్ కి వచ్చే అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఆరకంగా ప్రచారానికి ప్రచారం..కొంత ఆదాయం కూడా వస్తుంది. `ఆర్ ఆర్ ఆర్` బ్రాండ్ ని రాజమౌళి ఏ రేంజ్ లో వాడారో తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ లోగోలు..చరణ్..ఎన్టీర్ లుక్స్ ముద్రించి ఓ వెబ్ సైట్ ని కూడా లాంచ్ చేసి అమ్మకాలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దుబాయ్ లో ఈవెంట్ జరిపితే భారీగా ఆదాయం వస్తుందనే కోణంలో అక్కడ ప్లాన్ చేసినట్లు ప్రచారం సాగుతోంది.