దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ ''ఆర్.ఆర్.ఆర్''. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న ఈ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ - అలియా భట్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'బాహుబలి' తర్వాత రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి తగ్గట్టుగానే ట్రిపుల్ ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరుగుతోందని తెలుస్తోంది.
ఇండియాలో ఏ సినిమాకి జరగని విధంగా 'ఆర్.ఆర్.ఆర్' చిత్రానికి సుమారు 500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ప్రచారం జరుగుతోంది. నైజాంలో దాదాపు 75 కోట్లు - ఆంధ్ర సీడెడ్ 165 కోట్లు - తమిళనాడులో 48 కోట్లు - కర్ణాటకలో 45 కోట్లు - కేరళలో 15 కోట్లకు ఈ సినిమా రైట్స్ అమ్ముడుపోయాయట. ఒక హిందీ రైట్స్ దాదాపు 100 కోట్లకు అమ్మగా.. ఓవర్సీస్ లో రూ. 70 కోట్ల బిజినెస్ జరిగిందని అంటున్నారు. అలానే ఈ సినిమా డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులు కూడా భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ సంస్థ అన్ని భాషల డిజిటల్ - శాటిలైట్ రైట్స్ కోసం సుమారు 225 కోట్లు ఆఫర్ చేసిందని ట్రేడ్ టాక్. ఇదే కనుక నిజమైతే భారతీయ సినీ చరిత్రలోనే ఈ రేంజ్ లో అమ్ముడుపోయిన సినిమాగా 'ఆర్.ఆర్.ఆర్' నిలవనుంది.
ఇదిలావుండగా ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. అలానే త్వరలోనే రామ్ చరణ్ - అలియా భట్ లతో ఓ సాంగ్ షూట్ చేయడానికి పెద్ద సెట్ ఏర్పాటు చేశారు. అయితే అలియా బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ కి కరోనా సోకడం.. దీని కారణంగా అలియా క్వారంటైన్ అయ్యారని వార్తలు వచ్చాయి. కానీ అదేమీ లేదని తేలడంతో ముందుగా ప్లాన్ చేసుకున్నట్లే ట్రిపుల్ ఆర్ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. దీని కోసం త్వరలోనే అలియా హైదరాబాద్ కు రానుంది. చరణ్ - అలియా కాంబోలో ఓ పాటతో పాటు కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారని సమాచారం.