ప్రభాస్ చాలా గ్యాప్ తరువాత 'రాధేశ్యామ్' సినిమాతో ఈ రోజున థియేటర్లకు వచ్చాడు. రిలీజ్ కి ముందు ఆయనను రాజమౌళి చేసిన ఇంటర్వ్యూ హైలైట్ గా నిలిచింది. ఈ సినిమా కథ .. మేకింగ్ .. పాటలు .. ప్రభాస్ యాక్టింగ్ గురించి రాజమౌళి ప్రస్తావించారు.
తనకి నచ్చిన అంశాలను గురించి మాట్లాడారు. 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ కి రెడీ అవుతుండగా రాజమౌళి వచ్చి 'రాధేశ్యామ్' గురించి మాట్లాడటం తనకి చాలా సంతోషాన్ని కలిగించిందని ప్రభాస్ అన్నాడు. మొదటి నుంచి కూడా ఈ రెండు సినిమాల మధ్య ఏదో ఒక సంబంధం ఉంటూ వచ్చిందని చెప్పాడు.
ఆ విషయాలను ఆయన గుర్తు చేస్తూ .. "అన్నపూర్ణలో ఒక వైపున 'రాధేశ్యామ్' షూటింగు జరుగుతూ ఉంటే, మరో వైపున 'ఆర్ ఆర్ ఆర్' షూటింగు జరుగుతూ ఉండేది. చాలా కాలం తరువాత మన ఇద్దరం అక్కడ కలుసుకున్నాం. అన్నపూర్ణలో మూడు నాలుగు సెటప్ లు ఏర్పాటు చేసుకుని అక్కడ షూటింగు కానిస్తూ ఉండేవారు. ఒక రోజున నాకు కార్తికేయ కాల్ చేసి 'డాళింగ్ అలియా భట్ కి సంబంధించిన సెటప్ ఒకటి ఉంది .. మీ సెట్ లో చేసుకుంటాము' అని అడిగాడు. 'చేసేయ్ రా బాబూ ఇక్కడ చాలా ఖాళీ ఉంది' అని అన్నాము.
ఇలా మన సినిమాలు ఒకే సమయంలో .. ఒకే సెట్లో షూటింగులు జరుపుకోవడం, ఒక నెలలో విడుదలకి రెడీ అవుతుండటం, మధ్యలో తెర మాత్రమే కట్టి అటు మీరు యాక్షన్ చెబుతుండటం .. ఇటు రాధాకృష్ణ యాక్షన్ చెప్పడం ఇదంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. సార్ ఈ మధ్యలో మీరు వరుసగా చాలా పెద్ద సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఓ మూడు నాలుగు కోట్లలో 'మర్యాదరామన్న' వంటి సినిమాను మళ్లీ మీ నుంచి ఆశించవచ్చా? అసలు చిన్న సినిమాలు చేసే ఆలోచన ఉందా? అంటూ రాజమౌళిని ప్రభాస్ అడిగాడు.
అందుకు రాజమౌళి స్పందిస్తూ .. "చిన్న సినిమాను చేయవచ్చు. అయితే ఆ సినిమాలోని ఒక ఎమోషన్ ను బలంగా చెప్పాలనుకున్నప్పుడు .. అందులోని పాయింట్ ను గ్రాండ్ గా చూపించాలనుకున్నప్పుడు .. ఆ సినిమాలో ప్రతి సీన్ పెర్ఫెక్ట్ గా రావడానికి ట్రై చేసినప్పుడు దాని లెక్కలు మారిపోతుంటాయి.
ఇక సాధారణంగా నేను పాటలు వినను ..కానీ కార్లో వెలుతూ 'రాధేశ్యామ్' పాటలు వింటున్నాను. 'ఈ రాతలే' .. 'సంచారి' ఈ రెండు పాటలు మాత్రం నాకు బాగా నచ్చాయి' మా ఫ్యామిలీ నుంచి ఫస్టు రోజున మొదటి ఆటకి 44 మంది ఈ సినిమాకి వెళుతున్నాము" అని రాజమౌళి చెప్పగానే ప్రభాస్ చప్పట్లు కొడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.