ప్రతిష్ఠాత్మక RRR అక్టోబర్ లో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇంతకీ ఈ సినిమాకి పాటలు పాడుతున్నది ఎవరో తెలుసా? ప్చ్.. ఎవరో శ్రేయా ఘోషల్ అయ్యుంటారు అనుకుంటున్నారా? కానీ ఇప్పుడు తెలిసిన సమాచారం ఏమంటే.. హిందీ వెర్షన్ పాటను ఆలియా పాడేస్తోందట. ఈ మూవీలో అల్లూరి సరసన సీతగా నటించేస్తున్న ఆలియా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించాల్సి ఉండగా.. ఆ పాటను తానే స్వయంగా ఆలపించేస్తోందట.
సంజయ్ లీలా భన్సాలీ `గంగూబాయి కతియావాడి`లో అలియా భట్ పాటలు శ్రేయా ఘోషల్ చేత పాడించినా.. ఎస్ ఎస్ రాజమౌళి మాత్రం RRR లో పాటకు అలియా భట్ కే ఛాన్సిచ్చేశారట. ఆలియా ఇంతకుముందు ఇంతియాజ్ అలీ `హైవే`లో .. శశాంక్ ఖైతాన్ `హంప్టీ శర్మ కి దుల్హానియా`లో పాడిన విషయం తెలిసిందే. ఆ పాటల్ని అభిమానులు ఇంకా మర్చిపోనే లేదు. ఇపుడు RRR హిందీ వెర్షన్ లో పాడటానికి సిద్ధమైపోతోంది.
ఓ సోర్స్ వివరాల ప్రకారం.. ఆలియాకు RRR లో ఒక పెద్ద పాట ఉంది. అద్భుతంగా డ్యాన్స్ చేస్తూనే.... స్వయంగా పాడాల్సి ఉంటుందట. తమిళం - తెలుగు భాషలలో ఉచ్చారణ సమస్య ఉంటుంది కాబట్టి పాడటం లేదు కానీ హిందీ వరకూ ఆలియానే పాడేస్తోందట.
మరోవైపు `గంగూబాయి కతియావాడి`లో అలియా పాత్ర మొదటి ఫ్రేమ్ నుండి చివరి వరకు తెరపై కనిపిస్తుంది. RRR లో అతిథి పాత్ర లో కనిపిస్తుంది. గెస్ట్ స్టార్ అని టైటిల్స్ లో వేస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది.