జగన్ తో ఎన్టీయార్... చరణ్ ?

Update: 2021-11-15 23:30 GMT
టాలీవుడ్ ఇపుడు అతి పెద్ద కష్టం ఎదుర్కోంటోంది. అది కూడా ఏపీ నుంచే. టాలీవుడ్ లో నూటికి తొంబై శాతం హీరోలు ఆంధ్రా నుంచే వచ్చారు. అయితే వారంతా తెలంగాణాలో సెటిల్ అయ్యారు. పేరుకు రెండు రాష్ట్రాలుగా ఉన్నా టాలీవుడ్ కంప్లీట్ గా తెలంగాణాలోనే లొకేట్ అయింది.

దాంతో ఏపీకి ఏంటి లాభం అన్న చర్చ కొంతకాలంగా సాగుతూనే ఉంది. ఇక ఆ విషయం కావచ్చు, మరేదైనా కావచ్చు. టాలీవుడ్ కి ఏపీ కి దూరం అయితే పెరిగింది. ఈ క్రమంలో ఏపీ సర్కార్ టికెట్ల ధరలను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం టాలీవుడ్ కి శరాఘాతంగా మారింది.

నిజానికి ఏపీలోనే ఎక్కువ థియేటర్లు ఉన్నాయి. దాంతో రెవిన్యూ ఎక్కువగా వచ్చేది అక్కడ నుంచే. అయితే ఏపీ సర్కార్ టికెట్ల రేట్ల విషయంలో ఒక విధానం పెట్టుకుంది. అది చిన్న సినినా అయినా పాన్ ఇండియా లెవెల్ అయినా కూడా ఒక్కటే రేటూ, ఒక్కటే రూలూ అంటోంది.

దీని మీద చిన్న హీరోలకు ఇబ్బంది లేకపోయినా స్టార్ హీరోల సినిమాలు మాత్రం భారీ లాస్ ని కేవలం ఏపీ నుంచే చూడనున్నాయి. టికెట్ల రేట్లను పెంచాలని కొంతకాలంగా కోరుతున్నా కూడా సినీ ప్రముఖుల నుంచి డెలిగేషన్ అయితే పూర్తి స్థాయిలో వెళ్ళి కలిసింది లేదు.

ఈ నేపధ్యంలో వెయిట్ చేసి చేసి పెద్ద సినిమాలు అన్నీ కూడా థియేటర్ల వైపు క్యూ కడుతున్నాయి. జనవరిలో ట్రిపుల్ ఆర్ మూవీ ఉంది. ఆ తరువాత రాధేశ్యామ్ ఉంది. ఈ రెండూ పాన్ ఇండియా మూవీస్. దాని కంటే ముందు డిసెంబర్ లో పుష్ప‌ రిలీజ్ అవుతోంది.

ఇక డిసెంబర్ 2న అఖండ కూడా రిలీజ్ డేట్ ఇచ్చేసింది. దాంతో పెద్ద సినిమాలు ఎక్కడ హిట్ అయినా కూడా ఏపీలో మాత్రం టికెట్ల రేటు వల్ల లాస్ తప్పదని అంటున్నారు. ఈ క్రమంలో ఏపీ సర్కార్ టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న డిమాండ్ అయితే బాగా వస్తోంది.

దీని మీద ట్రిపుల్ ఆర్ టీమ్ అయితే నేరుగా జగన్ని కలవాలని చూస్తోందని టాక్. జనవరి 7న భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం టికెట్ల రేట్లు పెంచాలని కోరబోతున్నారుట. ఈ టీమ్ లో దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్యతో పాటు హీరోలు ఎన్టీయార్, చరణ్ ఉంటారని అంటున్నారు.

మరి జగన్ ట్రిపుల్ ఆర్ టీమ్ ప్రతిపాదనకు సానుకూలంగా రియాక్ట్ అవుతారా అన్నది చూడాలి. ఈ మూవీ 450 కోట్ల బడ్జెట్ తో ఫినిష్ చేశారు. దాంతో ఏపీ సర్కార్ అనుమతి ఇవ్వకపోతే భారీ నష్టం తప్పదని అంటున్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి.




Tags:    

Similar News