జాన్వీకి మరో షాక్ తగిలినట్టు ఉందే!

రీసెంట్ గా టాలీవుడ్ లోకి తన తెలుగు ఫేవరేట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్-1 మూవీతో అడుగు పెట్టింది అమ్మడు.

Update: 2024-09-30 16:08 GMT

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్.. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన కాన్సెప్టులు ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తన కంటూ స్పెషల్ ఇమేజ్ తో పాటు ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుని నటిస్తోంది. రీసెంట్ గా టాలీవుడ్ లోకి తన తెలుగు ఫేవరేట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవర పార్ట్-1 మూవీతో అడుగు పెట్టింది అమ్మడు.

కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవరలో తంగం పాత్రలో జాన్వీ కపూర్ కనిపించింది. తన లుక్స్ తో ఆకట్టుకున్నా.. స్క్రీన్ పై ఎక్కువ సేపు కనిపించలేదు. సీక్వెల్ లో జాన్వీ రోల్ కు మంచి స్కోప్ ఉందని మేకర్స్ మూవీ రిలీజ్ కు ముందే వెల్లడించారు. తెలుగు డెబ్యూతో మంచి హిట్ అందుకున్న అమ్మడు.. తన సెకండ్ మూవీ రామ్ చరణ్ తో చేయనున్న విషయం తెలిసిందే. అదే సమయంలో బాలీవుడ్ లో కూడా పలు ప్రాజెక్టుల్లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.

ఇదంతా పక్కన పెడితే.. తాజాగా జాన్వీ కపూర్ కు షాక్ తగిలింది! కొద్ది రోజుల క్రితం ఉలాజ్ మూవీతో ఆమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఆ సినిమాలో ఇండియా నుంచి లండన్ ఎంబసీలో పని చేయడానికి వెళ్లిన ఓ ఐఎఫ్ఎస్ అధికారిణి పాత్రలో యాక్ట్ చేసింది. సినిమా కోసం బాగా కష్టపడింది కూడా. కానీ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద పేలవ వసూళ్లు రాబట్టిన ఉలాజ్.. నిరాశపరిచింది.

అయితే థియేటర్లలో నిరాశపరిచిన కొన్ని సినిమాలు ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంటాయి. మంచి వ్యూస్ కూడా దక్కించుకుంటాయి. దీంతో జాన్వీ కపూర్ ఉలాజ్ మూవీ విషయంలో అలాగే జరుగుతుందేమోనని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ గత వారం నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ కు వచ్చిన ఆ మూవీ.. ఓటీటీ ఆడియన్స్ ను కూడా అట్రాక్ట్ చేయలేకపోయింది. దీంతో జాన్వీ కపూర్ మరో షాక్ తగిలినట్టైంది!

చెప్పాలంటే.. దర్శకుడు ఉలాజ్ కోసం మంచి కాన్సెప్టే ఎంచుకున్నారు. ఐఎఫ్ఎస్ అధికారులు బ్లాక్ మెయిలింగ్ బారిన పడితే ఏం జరుగుతుందనే అంశంతో సినిమా తెరకెక్కించారు. జాన్వీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి ఉగ్రవాదులు రహస్యాలు చేజిక్కించుకోవాలని చూస్తారు. ఆ ట్రాప్ నుంచి ఆమె ఎలా బయటపడిందనేది సినిమా. కానీ వీక్ స్క్రీన్ ప్లేతో మూవీ రూపొందించిన డైరెక్టర్.. స్టోరీని చెప్పడంలో తడబడ్డాడు. దీంతో సినిమా ఫ్లాప్ గా మారిపోయింది.

Tags:    

Similar News