మేడం టుస్సాడ్స్‌లో చరణ్‌ తో రైమ్‌

కానీ మొదటి సారి ఒక హీరో తో పాటు ఆయన పెట్‌ యొక్క విగ్రహంను ఏర్పాటు చేయబోతున్నారు.

Update: 2024-09-30 19:30 GMT

సింగపూర్‌లోని మేడం టుస్సాడ్స్‌లో ఇప్పటికే ప్రభాస్‌, మహేష్ బాబు, అల్లు అర్జున్‌ తో పాటు పలువురు ఇండియన్‌ స్టార్స్‌ యొక్క మైనపు విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. సినీ ప్రముఖులతో పాటు, ఇతర రంగాల్లో గొప్ప గౌరవం ను సొంతం చేసుకున్న వారికి మేడం టుస్సాడ్స్ లో మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఇప్పటి వరకు హీరోల మైనపు విగ్రహాలు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మొదటి సారి ఒక హీరో తో పాటు ఆయన పెట్‌ యొక్క విగ్రహంను ఏర్పాటు చేయబోతున్నారు. ఇది అతి పెద్ద విషయం గా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

రామ్‌ చరణ్‌ మైనపు విగ్రహం ఎప్పుడెప్పుడు మేడం టుస్సాడ్స్ లో పెడతారా అంటూ మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఎట్టకేలకు వారి కల నెరవేరబోతోంది. అయితే ఇతర హీరోల మాదిరిగా సోలో గా విగ్రహం కాకుండా అంతకు మించి అన్నట్లుగా మేడం టుస్సాడ్స్ లో స్పెషల్‌ విగ్రహం ను ఏర్పాటు చేయబోతున్నారు. చరణ్ తో పాటు ఆయనకు ఎంతో ఇష్టమైన పెట్‌ డాగ్‌ రైమ్‌ కి సైతం మేడం టుస్సాడ్స్ లో చోటు సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్‌ హీరోకు దక్కని అరుదైన రికార్డ్‌ రామ్‌ చరణ్ కి దక్కడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

సింగపూర్‌ మేడం టుస్సాడ్స్ లో విగ్రహం ఏర్పాటు కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రామ్‌ చరణ్‌ ఆర్ఆర్‌ఆర్‌ సినిమాతో గ్లోబల్‌ స్టార్‌ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో చరణ్ నటనకు అంతా ఫిదా అయ్యారు. సినిమాలో చరణ్‌ లుక్ కి అంతా ఫిదా అయ్యారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే ఆ సినిమా విడుదల కాబోతుంది.

రామ్‌ చరణ్‌ 'గేమ్‌ ఛేంజర్‌' సినిమా తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఆ సినిమా కోసం చరణ్‌ ప్రత్యేకంగా ఫిజికల్‌ ఫిట్‌నెస్ కోసం శిక్షణ తీసుకుంటున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై ఇటీవల పలు వార్తలు వచ్చాయి. బుచ్చి బాబు దర్శకత్వంలో చరణ్ చేయబోతున్న సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో ఉంటుంది. సినిమా లో చరణ్ లుక్ కి అంతా షాక్ అవుతారనే టాక్ వినిపిస్తుంది. బుచ్చిబాబు సినిమా 2026 లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గేమ్‌ ఛేంజర్ సినిమాతో చరణ్ భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News