తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇండియన్ సినీ ప్రేమికులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ చిత్రంను మొదట జులై 30న విడుదల చేయాలనుకున్నారు. అయితే మేకింగ్ విషయంలో హడావుడి అవ్వొద్దనే ఉద్దేశ్యంతో సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా వేసిన విషయం తెల్సిందే. షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్న సమయంలో కరోనాతో షూటింగ్ ఆగి పోయిన విషయం తెల్సిందే. లాక్ డౌన్ తో షూటింగ్ ఆగిపోవడం వల్ల సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే దానయ్య ఆ వార్తలను కొట్టి పారేశాడు. ఖచ్చితంగా సంక్రాంతికే సినిమాను విడుదల చేస్తామంటూ ఇటీవలే ప్రకటించాడు. అయినా కూడా పుకార్లు ఆగలేదు. తాజాగా బాహుబలి డేట్ కు ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం రాబోతుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ కు సినిమా విడుదల వాయిదా పడ్డట్లే అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరోసారి యూనిట్ సభ్యులు అనధికారికంగా స్పందించారు.
షూటింగ్ కేవలం 45 రోజులు మాత్రమే మిగిలి ఉందని.. లాక్ డౌన్ కంటిన్యూగా మూడు నెలలు కొనసాగినా కూడా ఎలాంటి ఇబ్బంది ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను విడుదల చేస్తామంటున్నారు. సినిమా షూటింగ్ కు ఎక్కువ సమయం పట్టదని.. నిర్మాణానంతర కార్యక్రమాలు ఒక వైపు కొనసాగుతున్నాయి కనుక విడుదల తేదీ మార్చాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు. జక్కన్న ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి సినిమాను విడుదల చేసి తీరుతాడంటూ వారు చెబుతున్నారు.
గతంలో జక్కన్న షూటింగ్ దాదాపుగా 70 శాతంకు పైగా పూర్తి అయ్యిందంటూ పేర్కొన్నాడు. కనుక షూటింగ్ చాలా తక్కువ ఉండటం వల్ల అనుకున్న సమయం కు ఖచ్చితంగా వస్తామని యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. కనుక ఫ్యాన్స్ ఇంకా ప్రేక్షకులు ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదు.