డిసెంబర్ - జనవరి సీజన్ ఫుల్ ఫెస్టివల్ మూడ్ ని తలపించనుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప` డిసెంబర్ 17న విడుదలవుతోంది. 20రోజుల గ్యాప్ తర్వాత జనవరి 7న ఆర్.ఆర్.ఆర్ చిత్రం భారీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాలపైనా భారీ హైప్ నెలకొంది. ఇవి రెండూ పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా విడుదలవుతున్నాయి. ట్రైలర్ రాక గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. తాజా సమాచారం మేరకు..
RRR ట్రైలర్ డిసెంబర్ 3న విడుదల కావాల్సి ఉండగా.. లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల మరణంతో ట్రైలర్ లాంచ్ వాయిదా పడింది. అయితే మరో భారీ చిత్రం `పుష్ప- ది రైజ్` ట్రైలర్ డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రావలసి ఉంది. పుష్ప టీమ్ అదే ప్లాన్ తో ఉన్నారని తెలిసింది.
మరోవైపు ఆర్.ఆర్.ఆర్ బాలీవుడ్ ప్రమోషన్స్ కోసం రాజమౌళిపై ఒత్తిడి పెరుగుతోందట. అతని నిర్మాత డివివి దానయ్యపై ఒత్తిడి చేస్తున్నందున RRR ట్రైలర్ కూడా 6వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉందని ఒక లీక్ అందింది. అయితే ఒకే రోజు రెండు క్రేజీ ట్రైలర్ లను విడుదల చేయడంలో తప్పు లేదు కానీ రెండు వేర్వేరు రోజుల్లో విడుదల చేస్తే బాగుంటుందని సూచనలు అందుతున్నాయి. ప్రేక్షకులు రెండింటినీ పోల్చి చూసే సన్నివేశం సరికాదనేది కొందరి విశ్లేషణ.
ట్రైలర్ లాంచ్ ఒకేరోజు ఉంటే అభిమానులు పోలికలు చూడడం కామెంట్లు చేయడం సహజం. ఒక రోజు గ్యాప్ ఉంటే అది కాస్త తగ్గుతుంది. అందుకే విభిన్న తేదీల్ని ఎంపిక చేయాల్సిందిగా సూచనలు అందుతున్నాయి. కానీ ఈ రెండు ట్రైలర్ల క్లాష్ ఖాయమేనని కూడా గుసగుస వినిపిస్తోంది. ఏం జరగబోతోందో చూడాలి.