దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' ని దసరా సందర్భంగా అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి ఇద్దరు పెద్ద హీరోలు కలిసి నటిస్తున్న ఈ చిత్రం.. ఇప్పటికే మూడు సార్లు రిలీజ్ డేట్స్ మార్చుకుని ఫైనల్ గా రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పిన తేదీకి రావాలని షూటింగ్ ప్లాన్స్ రెడీ చేసుకుంది. అయినప్పటికీ మరోసారి విడుదల తేదీ మారే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ గా పిలవబడే రాజమౌళి 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో ప్రతీ సీన్ ని అద్భుతంగా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విజువల్ వండర్ లా తీర్చుదిద్దే క్రమంలో కొన్ని షెడ్యూల్స్ అనుకున్న సమయానికి పూర్తవడం లేదట. దీనికి తోడు రామ్ చరణ్ 'ఆచార్య' షూటింగ్ కోసం ట్రిపుల్ ఆర్ షూట్ కి బ్రేక్ ఇచ్చాడు. ఇలా అనేక కారణాల వల్ల చిత్రీకరణ లేట్ అవుతూ వస్తోందట. దీనికి తోడు ఇప్పుడు హీరోయిన్ అలియా భట్ కొన్ని రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయని అంటున్నారు. ఇంకా కొన్ని రోజుల షూట్ మిగిలే ఉంది. దీని తర్వాత విజువల్ ఎఫెక్ట్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేయాల్సి ఉంటుంది. అలానే ఇతర భారతీయ భాషల్లో విడుదలయ్యే సినిమా కాబట్టి డబ్బింగ్ పనులు కంప్లీట్ చేయడానికి చాలానే సమయం పట్టేలా ఉంది. అందుకే డెడ్ లైన్ పెట్టుకొని వర్క్ చేస్తున్నప్పటికీ అక్టోబరుకు సినిమాను రెడీ చేయడం కష్టమనే టాక్ వినిపిస్తోంది.
ఒకవేళ 'ఆర్.ఆర్.ఆర్' దసరాకు రెడీ అవ్వకపోతే 2022 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే ఇప్పటికే సంక్రాంతి బెర్త్ కంఫర్మ్ చేసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాను నటిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రాన్ని ప్రీ పోన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. దుబాయ్ లో రెండు షెడ్యూల్స్ షూటింగ్ జరుపుకున్న సర్కారు వారి పాటను ఈ ఏడాది దసరా బరిలో నిలిపే విధంగా షూటింగ్ ప్లాన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇందులో సాధ్యాసాధ్యాలపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.