RRR అక్క‌డ ర‌న్న‌ర‌ప్ గా నిలిచింది!

Update: 2022-07-02 07:30 GMT
'కొన్ని సార్లు ఓడిపోవ‌డం గొప్పా.. గెల‌వ‌డం గొప్పా అంటే ఓడిపోవ‌డం కూడా గొప్పే అని 'స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి' చిత్రంలో అల్లు అర్జున్ అన్న‌ట్టు రెండ‌వ స్థానంలో నిల‌వ‌డం కూడా ఇప్ప‌డు గొప్పే అని జ‌క్క‌న్న చెక్కిన RRR నిరూపించింది. వివ‌రాల్లోకి వెళితే... మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలి సారి క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టారర్ మూవీ 'RRR'. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా తెర‌కెక్కించిన ఈ మూవీ భారీ అంచ‌నాల మ‌ధ్య ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది.
 
వ‌ర‌ల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లోనూ విడుద‌లైన ఈ మూవీ రికార్డు స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకోవ‌డ‌మే కాకుండా విమర్శ‌కుల‌ని సైతం మెప్పింపి ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంవ‌ది.

బాక్సాఫీస్ వ‌ద్ద వండ‌ర్స్ ని క్రియేట్ చేసిన ఈ మూవీ థియేట్రిక‌ల్ ర‌న్ ఫినిష్ అయినా ఇప్ప‌టికి రికార్డుల్ని తిర‌గ‌రాస్తూనే వుంది. స‌రికొత్త చ‌ర్చ‌కు తెర‌లేపుతూనే వుంది. ఈ మూవీని ఇటీవ‌లే ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జీ 5, నెట్ ఫ్లిక్స్ ల‌లో స్ట్రీమింగ్ కావ‌డం మొద‌లు పెట్టింది.

ఆ క్ష‌ణం నుంచి హాలీవుడ్ మేక‌ర్స్‌, స్టార్స్‌, రైట‌ర్స్ ఈ మూవీపై ప్ర‌వంస‌ల వ‌ర్షం కురిపిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రూ. 1150 కోట్ల మేర వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లోనూ త‌న స‌త్తా చాటుతూ రికార్డు లు సృష్టిస్తోంది. ఈ స్థాయి ఆద‌ర‌ణ మునుపున్న‌డూ ఏ ఇండియ‌న్ మూవీకి ద‌క్క‌పోవ‌డంతో 'RRR' హాలీవుడ్ వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షిస్తూ అరుదైన ఘ‌న‌త‌ని సొంతం చేసుకుంటోంది.

ఇటీవ‌ల ఈ మూవీ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ విడుద‌ల చేసిన టాప్ 10 సినిమాల జాబితాలో చోటు ద‌క్కించుకుంది. ఇలా హాలీవుడ్ క్రిటిక్స్ జాబితాలో స్థానాన్ని సొంతం చేసుకున్న తొలి భార‌తీయ సినిమాగా 'RRR' రికార్డుని సాధించి వార్త‌ల్లో నిలిచింది. తాజాగా మ‌రో ఘ‌న‌త‌ని సాధించి భార‌తీయ సినిమా స‌త్తా ఏంటో యావ‌త్ ప్ర‌పంచానికి చాటింది.

తాజాగా హాలీవుడ్ క్రిటిక్స్ ప్ర‌క‌టించిన అవార్డ్స్ లో 'RRR' ప‌లు హాలీవుడ్ చిత్రాల‌ని వెన‌క్కి నెట్టి ర‌న్న‌ర‌ప్ గా నిల‌వడం విశేషంగా చెబుతున్నారు. భార‌తీయ సినీ చరిత్ర‌లో ఇది గొప్ప విష‌యంగా చెబుతున్నారు. ఇంత వ‌ర‌కు హాలీవుడ్ క్రిటిక్స్ జాబితాలో ఏ భార‌తీయ సినిమా చోటు ద‌క్కించుకోలేదు. అంతే కాకుండా క్రిటిక్స్ అవార్డ్స్ లో ర‌న్న‌ర‌ప్ గా 'RRR' నిల‌వ‌డం భార‌తీయ సినిమాకు ద‌క్కిన గౌర‌వంగా చెబుతున్నారు. ప‌లువురు ఇండియ‌న్ క్రిటిక్స్ ఈ విష‌యంపై హ‌ర్షాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.
Tags:    

Similar News