ఆర్‌ఆర్‌ఆర్‌ : అప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడేం చేస్తున్నారు?

Update: 2022-11-19 05:34 GMT
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా విడుదల అయ్యి చాలా నెలలు అయ్యింది. ఇప్పటికి కూడా ఏదో ఒక చోట ఈ సినిమా సందడి చేస్తూనే ఉంది. మొన్నటి వరకు జపాన్ లో ఈ సినిమా థియేటర్లలో తెగ సందడి చేసింది. దాదాపు మూడు వారాల పాటు మంచి వసూళ్లను అక్కడ ఈ సినిమా సాధించింది.

తాజాగా ఈ సినిమా యూనిట్‌ సభ్యులు ఆసక్తికర ఫోటోను షేర్ చేశాడు. ఈ సినిమా కోసం మొదటి సారి చర్చలు జరిగిన సమయంలో రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లతో రాజమౌళి ఇలా ఒక ఫొటోకు ఫోజు ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ సమయంలో ఒక సినిమా గురించి అంటూ ఎలాంటి ప్రకటన రాలేదు.

ఈ కాంబోలో సినిమా వస్తే బాగుండు అని చాలా మంది అనుకున్నారు. అనుకున్నట్లుగానే అద్భుతమైన ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా వచ్చింది. అయిదు సంవత్సరాల క్రితం ఈ ఫోటో అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు. రాజమౌళ కూడా ఈ ఫోటోను షేర్‌ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ ఫోటోను షేర్‌ చేసిన ఆర్ ఆర్‌ ఆర్‌ నిర్మాణ సంస్థ డివివి సినిమా సోషల్‌ మీడియా అయిదు సంవత్సరాల క్రితం మీరు ఏం చేస్తున్నారు.. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు అన్నట్లుగా కామెంట్‌ పెట్టింది. ఆ పోస్ట్‌ కు రకరకాల కామెంట్స్ ను నెటిజన్స్ చేస్తున్నారు.

అప్పుడు చదువుకుంటున్న తాను ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నాను అని.. అప్పుడు సింగిల్ గా ఉన్న తాను ఇప్పుడు పెళ్లి చేసుకుని పిల్లలకు తండ్రి అయ్యాను అని.. ఇలా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో వస్తున్న ఈ కామెంట్స్ చిత్ర విచిత్రంగా ఉన్నాయి.

మొత్తానికి ఈ ఒక్క సినిమా కోసం రాజమౌళి జర్నీ అయిదు సంవత్సరాల పాటు కొనసాగింది. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆస్కార్‌ అవార్డుల వేడుకల్లో నామినేషన్స్ కోసం రాజమౌళి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదే సమయంలో ఆర్‌ ఆర్‌ ఆర్‌ సీక్వెల్‌ కోసం కూడా కథ రెడీ అవుతుందని ప్రకటించాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News