క్రూర‌మైన విల‌న్ లేకుండానే RRR?

Update: 2022-03-29 03:30 GMT
RRR లో ఇంత‌కీ విల‌న్ ఎవ‌రు?  ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి టైపిక‌ల్ సినిమాల్లో క్రూర‌మైన విల‌నీ త‌ప్ప‌నిస‌రి. కానీ ఆర్.ఆర్.ఆర్ లో ఎవ‌రూ క‌నిపించ‌రేమిటీ? అంటూ యూత్ ప్ర‌శ్నిస్తున్నారు. ఛ‌త్ర‌ప‌తి స‌హా బాహుబ‌లి వ‌ర‌కూ ఎన్నో సినిమాల్లో రాజ‌మౌళి చూపించిన విల‌నీని త‌ల‌చుకుని ఇప్పుడు చాలామంది ఆర్.ఆర్.ఆర్ లో విల‌న్ ని వెతుకుతూ నోరెళ్ల‌బెడుతున్నారు.

నిజానికి ఆర్.ఆర్.ఆర్ లో విల‌న్ ఎవ‌రూ ఉండ‌రు. సంద‌ర్భానుసారం బ్రిటీష్ అధికారులే విల‌న్లు త‌ప్ప‌. ప్ర‌త్యేకించి ఒక భీక‌ర‌మైన విల‌న్ ఎవ‌రూ హీరోల‌ను ఎదురించ‌రు. రామ్ .. భీమ్ ల‌కు ఎదురు నిలిచే ధీరుడే లేడు. అయితే ఇదే ప్ర‌ధాన‌ లోపం అంటూ కొంద‌రు విశ్లేషిస్తుండ‌డం విశేషం. నిజానికి తార‌క్.. చ‌ర‌ణ్ అస‌మాన న‌ట‌నా కౌశ‌లం రాజ‌మౌళి ఎమోష‌న‌ల్ డ్రైవ్ వ‌ర్క‌వుట‌వ్వ‌డంతో క్రూర‌మైన విల‌న్ గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

అయితే ఇందులో కూడా ఒక ధీటైన భీక‌ర‌మైన‌ విల‌న్ ని రాజ‌మౌళి సెట్ చేసి ఉంటే గ్రాఫ్ మ‌రో లెవ‌ల్ కి చేరుకునేద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి లేని సినిమా ఎప్పుడూ వీకే. రాజ‌మౌళి ఇన్నాళ్లు ఆ త‌ప్పు చేయ‌లేదు. బాహుబ‌లిలో భ‌ళ్లాల‌దేవ లాంటి క్రూరుడిని సెట్ చేశాడు.
కానీ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ లో అలాంటి విల‌న్ లేడు. కానీ లోపం ఇదీ అని తెర‌పై క‌నిపించ‌లేదు. అత‌డిని త‌ర‌ణ్ ఆద‌ర్శ్ స‌హా క‌ర‌ణ్ జోహార్ లాంటి ఉద్ధండులు ఆకాశానికెత్తేస్తున్న తీరు చూస్తుంటే ఆర్.ఆర్.ఆర్ ఎంత‌గా స‌క్సెసైందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ ఊపులో భారీ వ‌సూళ్ల‌తో ఆర్.ఆర్.ఆర్ మేక‌ర్స్ కి భారీ లాభాల్ని తెచ్చేయ‌నుంద‌ని అంచ‌నా.
Tags:    

Similar News