RRR వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు..!

Update: 2022-06-16 09:31 GMT
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ''ఆర్.ఆర్.ఆర్'' మూవీ.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. మార్చి 25న థియేటర్లలోకి వచ్చిన ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 1118 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. GST తో కలుపుకొని రూ. 583 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ అందుకున్నట్లు పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్/తెలంగాణ రాష్ట్రాల్లో RRR సినిమా 265.65 కోట్ల షేర్ తో 394 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఒక్క నైజాంలోనే 112 కోట్ల వరకూ కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది తెలుగు రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూటర్స్ కు లాభదాయకమైన వెంచర్ గా మారితే.. పలువురు ఎగ్జిబిటర్లు మాత్రం లాస్ అయ్యారు. అలానే ఇతర రాష్ట్రాల్లో కొద్దిమంది డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రంపై నష్టపోయారు.

ఓవర్సీస్ లో 'ఆర్ ఆర్ ఆర్' మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ 27.5 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అందులో ఉత్తర అమెరికా నుంచే సగానికి పైగా వసూళ్ళు వచ్చాయని తెలుస్తోంది. ఓవరాల్ గా RRR ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన 4వ భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. 'దంగల్' 'బాహుబలి 2' & 'కెజిఎఫ్ 2' చిత్రాలు దీని కంటే ముందు నిలిచాయి.

 * RRR వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు పరిశీలిస్తే... (ట్రేడ్ నివేదికల ప్రకారం)

నైజాం – 111.80 కోట్లు

సీడెడ్ – 46 కోట్లు

యూఏ – 35.50 కోట్లు

నెల్లూరు – 10.50 కోట్లు

గుంటూరు – 18.10 కోట్లు

కృష్ణా – 14.70 కోట్లు

వెస్ట్ – 13.25 కోట్లు

ఈస్ట్ – 15.80 కోట్లు

*AP/TS మొత్తం - 265.65 కోట్లు(GSTతో కలుపుకుని) - 394 కోట్ల గ్రాస్

కర్ణాటక - 43 కోట్లు (83 కోట్ల గ్రాస్)

తమిళనాడు - 42.4 కోట్లు (80.5 కోట్లు గ్రాస్)

కేరళ - 10.6 కోట్లు (25.8 కోట్ల గ్రాస్)

నార్త్ - 126 కోట్లు (324 కోట్ల గ్రాస్)

ఓవర్సీస్ - 95 కోట్లు (210 కోట్లు గ్రాస్)

*మొత్తం (వరల్డ్ వైడ్) - 582.65 కోట్లు (1117.30 కోట్ల గ్రాస్)

కాగా, ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ హీరోలుగా.. అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా కల్పిత కథతో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో రామరాజుగా చరణ్.. భీమ్‌ గా ఎన్టీఆర్ నటించారు. అజయ్ దేవగన్ - ఆలియా భట్‌ - ఒలివియా మోరిస్‌ - శ్రియా - సముద్ర ఖని ఇతర కీలక పాత్రలు పోషించారు.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన RRR సినిమా.. ఇప్పుడు ఓటీటీలోనూ అద్భుతమైన స్పందన తెచ్చుకుంటుండటం విశేషం.
Tags:    

Similar News