RRR ఖాతాలో మ‌రో అరుదైన ఘ‌న‌త‌

Update: 2022-06-29 09:30 GMT
మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలి సారి క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ `RRR`. స్టార్ డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని తెర‌కెక్కించారు.

భారీ అంచ‌నాల మ‌ధ్య ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన ఈ మూవీ డే వ‌న్ నుంచి విశేషంగా ఆక‌ట్టుకుంటూ రికార్డులు సృష్టించ‌డం మొద‌లు పెట్టింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వండ‌ర్స్ ని క్రియేట్ చేసింది.

లెజెండ‌రీ ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ గా చ‌రిత్ర‌లో నిలిచిపోయిన అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీం ల ఫిక్ష‌న‌ల్ స్టోరీకి క‌మ‌ర్షియ‌ల్ హంగుల్ని జోడించి త‌నదైన మార్కు ట్రీట్మెంట్ తో రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టించింది. ప‌ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 1150 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి తెలుగు సినిమా చ‌రిత్ర‌లో స‌రికొత్త అధ్యాయాన్ని లిఖించింది. మే 20న పాపుల‌ర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లైన జీ5, నెట్ ఫ్లిక్స్ ల‌లో విడుద‌లై అక్క‌డ కూడా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది.

ద‌క్షిణాది భాష‌ల‌కు సంబంధించి జీ5లో స్ట్రీమింగ్ అవుతుండ‌గా హిందీ వెర్ష‌న్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని నెట్ ఫ్లిక్స్ లో చూస్తున్న హాలీవుడ్ స్టార్స్, డైరెక్ట‌ర్స్‌, రైట‌ర్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇదొక అద్భుతం అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఇండియ‌న్ సినిమాని గ‌ర్వించేలా చేస్తున్న ఈ మూవీ కీర్తి కిరీటంలో తాజాగా మ‌రో ఘ‌న‌త వ‌చ్చి చేరింది.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న ఇండియ‌న్స్ తో పాటు ఇత‌ర దేశాల ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ నేప‌త్యంలో తాజాగా ఈ మూవీ మ‌రో అరుదైన ఘ‌న‌త‌ని సాధించి స‌రికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. హాలీవుడ్ విమ‌ర్శ‌కుల అసోసియేష‌న్ తాజాగా టాప్ 10 మూవీస్ కి సంబంధించిన జాబితాని విడుద‌ల చేసింది. ఈ జాబితాలో మాలీవుడ్ సినిమాల స‌ర‌స‌న RRR చేయ‌డం విశేషం.

ఇది మ‌న తెలుగు సినిమా సాధించిన అరుదైన ఘ‌న‌త‌గా చెబుతున్నారు. ఇంత వ‌ర‌కు ఈ ఘ‌న‌త ఏ భార‌తీయ చిత్రానికి ద‌క్క‌లేద‌ని, తొలిసారి ఈ జాబితాలో హాలీవుడ్ సినిమా స‌ర‌స‌న మ‌న సినిమా నిల‌వ‌డం గ‌ర్వ‌కార‌ణం అని అంతా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. దీనిపై ఇండియ‌న్ సినీ దిగ్గ‌జాలు, ప్రేక్ష‌కులు హ‌ర్షాన్ని వ్య‌క్తం చేస్తుండ‌టం విశేషం.
Tags:    

Similar News