హిందీ సినిమాల‌కు చుక్క‌లు చూపించాయి!

Update: 2022-08-02 03:30 GMT
సౌత్ నుంచి భారీ చిత్రాలు బాలీవుడ్ లో విడుద‌లై ఎలా డామినేట్ చేస్తున్నాయో ఇటీవ‌ల చూస్తున్నాం. పుష్ప - ఆర్‌.ఆర్‌.ఆర్- కెజిఎఫ్ 2- విక్రమ్ .. ఇప్పుడు విక్రాంత్ రోనా వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగులు సాధించి పోటీబ‌రిలో ఉన్న హిందీ సినిమాల‌కు చుక్క‌లు చూపించాయి. నిజానికి ఇటీవ‌లి కాలంలో దేశంలో పెద్ద‌న్నగా చెప్పుకునే బాలీవుడ్ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా కష్టపడుతోంది. దక్షిణాది సినిమాలు హిందీ సినిమాల కంటే భారీ మార్జిన్ తో రాణిస్తున్నాయి. రేస్ లోకి ఇప్పుడు సుదీప్ న‌టించిన `విక్రాంత్ రోనా` కూడా చేరింది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ మూవీ  3 రోజుల్లో రూ. 80 కోట్లకు పైగా సంపాదించింది. ఇది రణబీర్ కపూర్ భారీ చిత్రం `శంషేరా` జీవితకాల క‌లెక్ష‌న్ల అంచ‌నా కంటే  ఎక్కువ.

కమల్ హాసన్- సేతుప‌తి- ఫ‌హ‌ద్ కీల‌క పాత్ర‌ల్లో నటించిన `విక్రమ్` మొదటి వారాంతంలో 100 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇలాంటి దూకుడు పోటీబ‌రిలో ఉన్న ఇత‌ర హిందీ చిత్రాల‌కు సాధ్య‌ప‌డ‌లేదు.

రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్  క‌థానాయ‌కులుగా SS రాజమౌళి తెర‌కెక్కించిన‌ RRR ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. యష్ నటించిన కేజీఎఫ్ 2 మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. అల్లు అర్జున్- రష్మిక మందన్న జంటగా నటించిన పుష్ప చిత్రం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.173 కోట్లు వసూలు చేసింది. ఈ రేంజును హిందీ రిలీజ్ లు క‌నీసం ట‌చ్ కూడా చేయ‌లేక‌పోయాయి.

దక్షిణాది సినిమాల‌కు ద‌రి దాపుల్లో లేక‌పోయినా కానీ ఈ సీజ‌న్ లో
భూల్ భూలయ్యా 2 - గంగూభాయి క‌థియావాడీ ఫ‌ర్వాలేద‌నిపించే వసూళ్ల‌ను సాధించాయి. కార్తీక్ ఆర్యన్ భూల్ భూలయ్యా 2 చిత్రం 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 80 కోట్లు వ‌సూలు చేయ‌డం విశేషం.

అలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడి మూడు రోజుల్లో 39 కోట్లు రాబట్టింది. వరుణ్ ధావన్- కియారా అద్వానీ- అనిల్ కపూర్ - నీతూ కపూర్ నటించిన `జగ్ జగ్ జీయో` మూడు రోజుల్లో 15 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇవ‌న్నీ సౌత్ సినిమాల హ‌వా ముందు ఆరంభ వ‌సూళ్ల‌లో చ‌తికిల‌బ‌డ్డాయి.
Tags:    

Similar News