'హరిహర వీరమల్లు' బడ్జెట్‌ లో రూ.100 కోట్లు ఆ రెంటి కోసం!!

Update: 2021-05-21 05:34 GMT
పవన్ కళ్యాణ్‌ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్‌ ఛారిత్రాత్మక సినిమా హరిహర వీరమల్లు షూటింగ్‌ ఇప్పటికే కొంత భాగం పూర్తి అయ్యింది. ఛారిత్రాత్మక సినిమాలను తీయడంలో దిట్ట అయిన క్రిష్ ఈ సినిమాను గతంలో తాను చేసిన రెండు సినిమాలను మించి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 150 కోట్లకు పైబడిన బడ్జెట్‌ తో ఈ సినిమాను ఏఎమ్‌ రత్నం నిర్మిస్తున్నాడు. ఈ సినిమా బడ్జెట్‌ లో దాదాపుగా 50 కోట్లకు పైగా గ్రాఫిక్స్ కోసం కేటాయించబోతున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున సెట్టింగ్స్ నిర్మించడంతో పాటు విజువల్‌ ఎఫెక్ట్స్ ను కూడా ఎక్కువగా ఈ సినిమా కోసం వినియోగించబోతున్నారు.

క్వాలిటీగా ఉండాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్‌ సభ్యులు హాలీవుడ్‌ టెక్నీషియన్స్ ను మరియు వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కోసం వినియోగించబోతున్నారట. హరి హర వీరమల్లు సినిమా గ్రాఫిక్స్ వర్క్ కోసం 50 కోట్లు ఖర్చు చేస్తూ ఉండగా మరో రూ.50 కోట్లను పవన్ కళ్యాణ్‌ పారితోషికంగా ఇస్తున్నారట. సినిమా బడ్జెట్‌ లో పవన్‌ బడ్జెట్‌ మరియు వీఎఫ్‌ఎక్స్‌ కోసమే వంద కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారనే సమాచారం అందుతోంది. షూటింగ్‌ పూర్తి అయ్యేప్పటికి సినిమా బడ్జెట్‌ మరింతగా పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ యూనిట్‌ సభ్యులు అనధికారికంగా చెబుతున్నారు.

ఈ సినిమా లో పవన్‌ కు జోడీగా నిధి అగర్వాల్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది. బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెస్‌ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మొఘల్స్‌ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందనే టాక్ వినిపిస్తుంది. మొత్తంగా ఈ సినిమాకు సంబంధించిన విషయాలు సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని క్రిష్‌ చాలా పట్టుదలతో ఉన్నాడు. కాని కరోనా అందుకు సహకరిస్తుందా లేదా అనేది చూడాలి.
Tags:    

Similar News