కరోనా ఎఫెక్ట్‌ : రూ. 35 పని చేస్తున్న 'కేజీఎఫ్‌' స్టార్‌

Update: 2020-04-01 05:15 GMT
మహమ్మారి కరోనా చిన్నా పెద్ద.. బీద ధనిక అనే తేడా లేకుండా అందరిపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పై కూడా ఈ ప్రభావం ఉందని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ముఖ్యంగా ఇండియాలో లాక్‌ డౌన్‌ విధించిన నేపథ్యంలో జనాలు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి వారి వారి ఇంటి పనులు.. చిన్న చిన్న పనులు చేసుకుంటూ టైం పాస్‌ చేస్తున్నారు.

ఈ సమయంలో కేజీఎఫ్‌ సినిమాకు సంగీతాన్ని అందించిన కన్నడ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవి బస్రూర్‌ తన వంశ వృత్తిని చేస్తున్నాడు. ప్రస్తుతం లాక్‌ ఔట్‌ కారణంగా తన సొంత ప్రాంతం అయిన ఉడిప్పి జిల్లా కుండపురకు వెళ్లిన రవి అక్కడ తన తండ్రి చేస్తున్న నగల తయారిలో భాగస్వామి అవుతున్నాడు. రవి తాజాగా ఒక వీడియోను షేర్‌ చేశాడు. ఆ వీడియోలో తన తండ్రికి హెల్ప్‌ గా వెండి ఆభరణాలు చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ఆ ఒక్క వెండి ఆభరణం చేసినందుకు గాను 35 రూపాయలు వస్తాయని ఆయన పేర్కొన్నాడు. ఈ పని చేస్తున్నందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నా తండ్రికి ఆసరగా ఉండటంతో పాటు నా వృత్తిని మళ్లీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ సంగీత దర్శకుడు రవి అన్నారు. కేజీఎఫ్‌ తో స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ గా పేరు దక్కించుకున్న రవి భారీ పారితోషికంను అందుకుంటున్నారు. ఈ సమయంలో ఆయన 35 రూపాయల వర్క్‌ చేయడం నిజంగా అభినందనీయం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే కొందరు ఇది ఫొటోలకు ఫోజ్‌ లు ఇవ్వడం వరకేనా లేదంటే రోజంతా కష్టపడుతున్నారా అంటూ ప్రశ్నిస్తున్నారు.
Tags:    

Similar News