కొత్త ట్విస్ట్: రుద్రమదేవి - సైజ్ జీరో ఒకే రోజు

Update: 2015-09-26 07:52 GMT
ఈ రోజు ఉదయం నుంచి ఒకటే గగ్గోలు. సైజ్ జీరో అక్టోబరు 9న విడుదలవుతోందనే ప్రకటన రాగానే ‘రుద్రమదేవి’ వాయిదా అని అందరూ ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడ్డ ‘రుద్రమదేవి’ని ఇక ఎవ్వరూ కాపాడలేరంటూ గుణశేఖర్ ను తిట్టిపోశారు. కానీ ఇంతలోనే పెద్ద ట్విస్ట్. అదేంటంటే.. ‘రుద్రమదేవి’ వాయిదా పడలేదట. అనుకున్నట్లే అక్టోబరు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందట. ‘రుద్రమదేవి’ పీఆర్వో స్వయంగా ఈ విషయాన్ని కన్ఫమ్ చేశాడు. అంతే కాదు.. ట్విట్టర్ లో రుద్రమదేవి అఫీషియల్ పేజీలో కొత్తగా మళ్లీ అక్టోబరు 9న రిలీజ్ అంటూ పోస్టర్ లు విడుదల చేశారు. ఆదివారం రిలీజ్ డేట్ కన్ఫమ్ చేస్తూ ప్రింట్ మీడియాలో యాడ్స్ కూడా ఇవ్వబోతున్నట్లు ‘రుద్రమదేవి’ టీమ్ ప్రకటించింది.

మరి ‘రుద్రమదేవి’ వాయిదా పడనపుడు.. సైజ్ జీరోను ఎందుకు అక్టోబరు 9నే రిలీజ్ చేస్తున్నారన్నది ఆసక్తికరం. వాస్తవానికి రుద్రమదేవి అక్టోబరు 9కి ఖాయం కాక ముందు ‘సైజ్ జీరో’ని అక్టోబరు 2న విడుదల చేయాలనుకున్నారు. ఐతే వారం వ్యవధిలో అనుష్క సినిమాలు రెండుంటే బాగోదని నెలాఖరుకు వాయిదా వేశారు. ఈ విషయంలో అనుష్కకు - గుణశేఖర్ కు మధ్య గొడవ కూడా జరిగిందని అప్పట్లో వార్తలొచ్చాయి. వారం గ్యాప్ లో వస్తున్నందుకే గొడవ జరిగినపుడు.. ఇప్పుడు ఒకే తేదీకి రెండు సినిమాల్నీ ఎలా విడుదల చేస్తారో మరి. పీవీపీ సంస్థ అక్టోబరు 9నే ‘సైజ్ జీరో’ ఖాయం అని గట్టిగా చెబుతోంది. తమిళ మీడియాకు సైతం ఈ మేరకు సమాచారం ఇచ్చింది. మరి ఉగాది రోజు నాని సినిమాలు ఎవడే సుబ్రమణ్యం - జెండాపై కపిరాజు రెండూ విడుదలైనట్లే అనుష్క సినిమాలు కూడా రెండూ ఒకే రోజు  పోటీ పడతాయా.. లేక ఏదో ఒకటి వాయిదా పడుతుందా చూడాలి.
Tags:    

Similar News