అక్కడ మాత్రం రుద్రమ సేఫ్

Update: 2015-10-09 19:30 GMT
‘రుద్రమదేవి’ పెట్టుబడికి తగ్గట్లు బిజనెస్ జరగలేదు కానీ.. ముందు ఉన్న అంచనాల కంటే ఎక్కువే బిజినెస్ చేసుకోగలిగాడు గుణశేఖర్. ఒక్క తెలుగు వెర్షన్ వరకే రూ.43 కోట్ల దాకా బిజినెస్ కావడమంటే చిన్న విషయమేమీ కాదు. తమిళ వెర్షన్ కు రూ.10 కోట్లు (థియేట్రికల్ బిజినెస్+శాటిలైట్ రైట్స్) పలకడం కూడా గొప్ప విషయం. ఐతే వచ్చే వారమే ‘బ్రూస్ లీ’, ఆపై వారం ‘అఖిల్’ వస్తున్న నేపథ్యంలో తెలుగు వెర్షన్ పెట్టుబడిని రికవర్ చేస్తుందా అన్నది డౌటుగానే ఉంది. తమిళంలో వారం లేటుగా వస్తుండటం పెద్ద నెగెటివ్ అవుతోంది. ఐతే తెలుగు - తమిళ వెర్షన్ల వరకు పెట్టుబడులు తిరిగి రావడం చాలా కష్టంగానే కనిపిస్తోంది.

ఐతే హిందీ, మలయాళ వెర్షన్ల వరకు సినిమాను కొన్నవాళ్లు సేఫ్ అవడం ఖాయం. ఎందుకంటే అక్కడ చాలా తక్కువ మొత్తాలకుు కొని.. ఎక్కువ  థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. హిందీ వెర్షన్ దాదాపు వెయ్యి థియేటర్లలో రిలీజ్ చేస్తుండటం విశేషం. రిలయన్స్ వాళ్ల హ్యాండ్ పడటంతో థియేటర్లకు ఢోకా లేకపోయింది. ‘బాహుబలి’లో నటించిన రానా - అనుష్క ఉండటం - ట్రైలర్ బావుండటంతో సినిమా మీద జనాలు ఆసక్తితోనే ఉన్నారు. కాబట్టి రూ.5 కోట్లు రికవర్ కావడం పెద్ద విషయం కాదు. ఇక మలయాళ వెర్షన్ ను అమ్మింది రూ.1.5 కోట్లకే. అందులోనూ శాటిలైట్ రైట్స్ కూడా. అక్కడ వందకు పైగా థియేటర్లలో రిలీజ్ చేశారు. అక్కడిది బిగ్ రిలీజే. అల్లు అర్జున్ ఫ్యాక్టర్ మలయాళ వెర్షన్ కు బాగా కలిసొస్తుందనడంలో సందేహం లేదు. పైగా సినిమాలో ఆ క్యారెక్టరే హైలైట్ అంటున్నారు కాబట్టి బాక్సాఫీస్ రన్ కు ఢోకా లేకపోవచ్చు. శాటిలైట్ రైట్సే ఈజీగా రూ.50 లక్షలు పలుకుతాయి కాబట్టి.. మలయాళ డిస్ట్రిబ్యూటర్ మంచి లాభాలు అందుకునే అవకాశం కూడా ఉంది.
Tags:    

Similar News