ఫోటో స్టోరి: చాక్లెట్ గాళ్‌ యోగా ఫీట్ చూశారా?

Update: 2020-08-27 12:10 GMT
టాలీవుడ్ సీనియ‌ర్ నిర్మాత ఎం.ఎస్.రాజుకు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `డ‌ర్టీ హ‌రి` గురించి ఇప్ప‌టికే యువ‌త‌రంలో చ‌ర్చ సాగుతోంది. ఈ మూవీకి సంబంధించిన పోస్ట‌ర్లు యూత్ లో వైర‌ల్ అయ్యాయి. ట్రైల‌ర్ జెట్ స్పీడ్ తో దూసుకెళుతోంది. ఈ ట్రైల‌ర్ ఆద్యంతం డ‌ర్టీ గేమ్ అందులో అందాల క‌థానాయిక‌ల హాట్ అప్పియ‌రెన్స్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ చ‌ర్చ‌ల్లో కీల‌కంగా వినిపిస్తున్న పేరు రుహానీ శ‌ర్మ‌.

డ‌ర్టీహ‌రి ట్రైల‌ర్ రిలీజ‌య్యాక ఉత్త‌రాది భామ‌ రుహానీ శ‌ర్మ గురించి మాత్రం ఆస‌క్తిగా మాట్లాడుకున్నారు. స‌హ‌నాయిక సిమ్ర‌త్ తో పోటీప‌డుతూ ఈ అమ్మ‌డు కూడా అద‌ర‌గొట్టింద‌న్న టాక్ వ‌చ్చింది. శ్రావ‌ణ్ రెడ్డి హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాని ఎస్.పి.జి. క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు- గూడూరు సాయి పునీత్ నిర్మించారు. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుని ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. అయితే క్రైసిస్ వ‌ల్ల వాయిదా ప‌డింది.

అదంతా స‌రే కానీ.. రుహానీ టాలీవుడ్ లో పెద్ద రేంజు కెరీర్ ని ఆశిస్తోంద‌ట‌. ఇప్ప‌టికే త‌న పేరును ప‌లువురికి ఎం.ఎస్.రాజు సిఫార‌సు చేశార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా నిరంత‌రం త‌న‌ని తాను లైమ్ లైట్ లో ఉంచుకునేందుకు ఇదిగో ఇలా సోష‌ల్ మీడియాల్ని వేడెక్కిస్తోంది. తాజాగా ఆరుబ‌య‌ట యోగా మ్యాట్ పై రుహానీ యోగా ఫీట్ వేడి పెంచుతోంది. ఓవైపు కాళ్ల‌ను 180-360 డిగ్రీల కోణంలో ఇలా ఆరాంగా తెర‌ప‌రిచి మ‌రోవైపు చాక్లెట్ తింటోంది రుహానీ. ప్ర‌స్తుతం ఈ ఫోటో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది. ఈ ప్ర‌చారం క‌లిసొచ్చి టాలీవుడ్ లో మ‌రిన్ని అవ‌కాశాలు అందుకుంటుందేమో చూడాలి.
Tags:    

Similar News