టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన ప్రముఖ వ్యాపారవేత్త అనే విషయం తెల్సిందే. ఆమె ఇండియాలోని ప్రముఖ లేడీ బిజినెస్ ఉమెన్స్ లో ముందు వరుసలో ఉంటారు. పలు రంగాల్లో ఆమె వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటారు. అదే సమయంలో భర్త రామ్ చరణ్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా దగ్గరుండి చూసుకుంటుంది. భర్తతో తనకున్న సన్నిహిత్యంను, చరణ్ చేసే సినిమాల గురించి సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు షేర్ చేసుకున్న ఉపాసన తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆడవారు భర్తల విషయంలో ఎలా ఉండాలి, వారికి ఎలాంటి సలహాలు ఇవ్వాలనే విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఉపాసన మాట్లాడుతూ.. ప్రతి సక్సెస్ ఫుల్ మ్యాన్ వెనుక ఒక ఉమెన్ ఉంటుంది అంటారు. ఆ విషయం మా తాతయ్య, అమ్మమ్మను చూస్తుంటే అనిపిస్తుంది. తాతగారిని వెనుక ఉండి నడిపించింది. ఆమె ఒక బలమైన మహిళగా నేను భావిస్తాను. భర్తను విజయవంతమైన దారిలో నడిపించడంను ఆమెను చూసి నేర్చుకోవచ్చు. భర్త సరైన దారిలో నడకుంటే తప్పులు దిద్దుతూ ముందుండి నడిపించాలి. ఆ విషయంలో మా అమ్మమ్మ పక్కాగా ఉండేవారు. అందుకే ఆమె నుండి నేను చాలా నేర్చుకున్నాను.
భారత సాంప్రదాయాలు మహిళలకు చాలా గౌరవాన్ని ఇచ్చాయి. ఆ గౌరవం నిలుపుకునేలా మహిళలు వ్యవహరించాలి. భర్తలు తప్పు చేసిన సమయంలో బౌండరీ దాటి, రూల్స్ బ్రేక్ చేసి వారి తప్పులను సరిదిద్దాలి. ఆ విషయంలో వెనకాడితే భర్త పతనంకు ఆమె కారణం అవుతుందని ఉపాసన పేర్కొంది. ఇండియాలో మహిళలు తమకు కావాల్సింది సాధించుకునే పరిస్థితులు ఉన్నాయంటూ ఉపాసన పేర్కొంది.