క‌మ‌ల్ విష‌యంలో కాకి లెక్క‌లు?

Update: 2015-12-17 11:30 GMT
ఉచితానుచిత‌ములు తెలిసిన‌వాడు.. అడ్వాన్స్‌డ్‌ గా ఆలోచించేవాడు .. నిండా మున‌గ‌డు. పైకి ఒక‌లా క‌నిపించి, లోన ఇంకోలా మ్యానేజ్ చేసే స‌త్తా ఇలాంటివారికి ఉంటుంది. ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్‌ హాస‌న్ కూడా అంతే. అత‌డు నాలుగున్నర ద‌శాబ్ధాల కెరీర్‌ లో చేసిన సంపాద‌న‌ను కేవ‌లం కొన్ని సినిమాల‌తో కోల్పోతాడా? న‌ష్ట‌పోయి నిండా మునిగిపోతాడా? అంటే అలా ఆలోచించేవారిదే తెలివిత‌క్కువ‌త‌నం. ఇటీవ‌లి కాలంలో త‌మిళ మీడియా ప్ర‌త్యేకించి ఓ ప్ర‌చారాన్ని తెరపైకి తెచ్చింది. క‌మ‌ల్‌ హాస‌న్ పూర్తిగా దివాళా తీసాడు. సొంత బ్యాన‌ర్ రాజ్‌ కమ‌ల్ ఫిలింస్‌ లో నిర్మించిన సినిమాల‌న్నీ ఫ్లాపులై భారీగా న‌ష్టాలు తెచ్చాయ్‌. అందుకే అత‌డు ఇన్నేళ్ల కెరీర్‌ లో లేని విధంగా ఓ యాడ్ ఫిలిం చేసేందుకు ఒప్పుకున్నాడ‌న్న ప్ర‌చారం సాగించింది త‌మిళ మీడియా.

అయితే మీడియా ఎనాలిసిస్‌ లు చూసిన వారికి ఇదేం పిచ్చి అనిపించ‌క మాన‌దు. ఇటీవ‌లే ప్ర‌ఖ్యాత ఫోర్బ్స్ మ్యాగ‌జైన్ క‌మ‌ల్‌ హాస‌న్‌ ని అత్యంత గొప్ప ధ‌న‌వంతుడిగా కీర్తించింది. ప్రిన్స్ మ‌హేష్ త‌ర్వాత మ‌ళ్లీ అంత సంపాదించేది ఆయ‌నొక్క‌డే అని పొగిడేసింది. అంత పెద్ద రీసెర్చ్ సంస్థ క‌మ‌ల్‌ ని అలా పొగిడేసింది అంటే ఏమీ లేకుండానే కాకి లెక్క‌లు చెబుతోందంటారా? ఇన్నేళ్ల స‌ర్వీసులో క‌మ‌ల్ ఆస్తుల్ని పోగేసుకోలేక‌పోయాడా? త‌న‌కి ఉన్న ప‌ర‌ప‌తిని ఉప‌యోగించుకుని త‌న బ్యాన‌ర్‌ లోకి విరివిగా బైట నుంచి పెట్టుబ‌డుల్ని స‌మ‌కూర్చుకోలేక‌పోతున్నాడా? మారుతి లాంటి నిన్న‌గాక మొన్న వ‌చ్చిన ఓ డైరెక్ట‌ర్ 10 నుంచి 15 సినిమాల్లో ఇన్వెస్టిమెంట్లు పెడుతుంటే.. కొండ‌త క‌మ‌ల్‌ హాస‌న్ ఆమాత్రం చేత‌కానివాడిలాగా ఉన్నాడా? ఇదంతా మీడియా నిర్వాకం అని చెవులు మూసుకోవాల్సొస్తోంది. ఈ నెగెటివ్ ప్రాచరం అంతా చెత్త‌గా లేదూ?


Tags:    

Similar News