రెండు రోజులుగా సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో రెండు వార్తలు అందరినీ గందరగోళంలోకి నెట్టాయి. జగపతి బాబుతో 'హితుడు' అనే సినిమా తీసిన యువ దర్శకుడు విప్లవ్ కోనేటి అనారోగ్యంతో చనిపోయాడన్నది ఒక వార్త అయితే.. విప్లవ కథానాయకుడు ఆర్.నారాయణమూర్తిని ఓ కెమెరామన్ కత్తితో పొడిస్తే ఆయన తీవ్రంగా గాయపడ్డారన్నది మరో వార్త. ఐతే ఈ రెండు వార్తలూ అబద్ధాలే అని తేలింది.
విప్లవ్ చనిపోయిన వార్త బయటపడి ఒక రోజు దాటుతున్నా ఎక్కడి నుంచి ఏ రెస్పాన్స్ లేకపోవడంతో అది వాస్తవమే అనుకున్నారు. కానీ ఆ వార్త వచ్చిన రెండో రోజు విప్లవ్ లైన్లోకి వచ్చాడు. తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మాట వాస్తవమే అని.. ఐతే తాను చనిపోలేదని.. కోలుకుంటున్నానని చెప్పాడు. తాను ఫోన్ స్విచాఫ్ చేసి.. ఎవరికీ అందుబాటులో లేకుండా ఉండటం పొరబాటే అని విప్లవ్ చెప్పాడు. ఎంబీబీఎస్ చదివిన విప్లవ్ 33 ఏళ్లకే చనిపోయాడనే వార్త విన్న వారందరినీ కలచివేసింది. ఇప్పుడందరూ హ్యాపీ.
ఇక నారాయణమూర్తి విషయానికొస్తే.. ఆయన చేస్తున్న కొత్త సినిమాకు ముందు ఓ కెమెరామన్‌ను పెట్టుకున్నారని.. తర్వాత మార్చేశారనీ.. దీంతో ఆ వ్యక్తి కత్తి తీసుకొచ్చి ఆయన్ని పొడిచేశారని ఫేస్‌బుక్, ట్విట్టర్లలో.. విస్తృతంగా ఓ వార్త ప్రచారమైంది. కానీ అదంతా ఉత్త ప్రచారమని తేలిపోయింది. ఆయన్ని అభిమానించే వ్యక్తులు స్వయంగా ఆయనింటికి వెళ్లి కలిసి.. ఆ ఫొటోల్ని షేర్ చేయడంతో గందరగోళానికి తెరపడింది.