సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఎస్ విఎస్ సి ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో `బ్రహ్మోత్సవం` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాజల్ - ప్రణీత - సమంత కథానాయికలుగా నటిస్తున్నారు. పివిపి సినిమాస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్. అందుకు తగ్గట్టే శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది. అయితే నిన్నటికి నిన్న ఈ సినిమా షూటింగ్ ని అర్థాంతరంగా ఆపేశారని వార్తలొచ్చాయి. శ్రీకాంత్ అడ్డాల తో మహేష్ కి అభిప్రాయ భేదాలొచ్చాయని, స్ర్కిప్టు విషయమై విభేధాలొచ్చాయని ప్రచారమైంది. అయితే దీన్ని చిత్రయూనిట్ ఖండించింది.
మా మధ్య ఎలాంటి విభేధాలు లేవు. యథావిధిగా హైదరాబాద్ లో ఈనెల 28 నుంచి డిసెంబర్ 8 వరకూ కొత్త షెడ్యూల్ జరుగుతుంది. మళ్లీ డిసెంబర్ 9 నుంచి నెలాఖరు వరకూ మరో షెడ్యూల్ ఊటీలో ప్లాన్ చేస్తున్నాం. వేసవి కానుకగా రిలీజ్ చేస్తాం అంటూ పీవీపీ సంస్థ ప్రకటించింది. అయితే నిప్పులేనిదే పొగ రాదంటారు. నిన్నటిరోజున బ్రహ్మోత్సవం చిత్రంపై అలాంటి ప్రచారం చేయాల్సిన అవసరం ఎవరికి కలిగింది? ఏవో చిన్నపాటి మనస్పర్థలు షూటింగుల్లో మామూలే. ఇలాంటి నెగెటివ్ విషయాల్ని స్ర్పెడ్ చేయాల్సినంత ఎమర్జెన్సీ ఏం వచ్చిందో? ఏమో..! అవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని తేలిపోయింది. ఇప్పటికైతే శ్రీకాంత్ అడ్డాలతో మహేష్ కి ఎలాంటి గొడవలు లేవు.. అని చెబుతున్నారు. బ్రహ్మోత్సవం చిత్రాన్ని తెలుగు - తమిళ్ రెండు భాషల్లో ఏకకాలంలో పూర్తి చేసి రిలీజ్ చేయనుంది పివిపి సంస్థ.