సౌత్ బ్యూటీ నయన తార.. ప్రస్తుతం దర్శకుడు విఘ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉందనే సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా.. ఆఖరికి విదేశాల్లో జరిగే అవార్డు ఫంక్షన్స్ కు వెళ్లినపుడు కూడా విఘ్నేష్ ను వెంట తీసుకెళ్లిపోవడం.. అక్కడ నయన్ చూసి ఈ దర్శకుడు మురిసిపోవడం లాంటివి కనిపిస్తూనే ఉన్నాయి. ఇదంతా ప్రేమ పక్షుల వ్యవహారం అనుకుంటున్నారు కానీ.. కొత్త పెళ్లి జంటగా పడుతున్న పాట్లు అనే టాక్ మొదలైపోయింది.
పెళ్లి జంట అంటే.. నయన్ కి పెళ్లయిపోయిందా అనే డౌట్ రావడం సహజమే. అసలు విషయం అదే కదా. మే నెలలోనే.. అంటే ఆరు నెలల ముందే విఘ్నేష్ శివన్ తో నయనతారకు పెళ్లి జరిగిపోయిందని.. ప్రస్తుతం వాళ్లిద్దరూ భార్యాభర్తలే అని కోలీవుడ్ కోడై కూస్తోంది. ప్రేమ వ్యవహారం పాకాన పడగానే.. పెళ్లి పీటలు ఎక్కేశారట. గతంలో రెండు సార్లు లవ్ స్టోరీలు ఫెయిల్ అయిన ఎక్స్ పీరియన్స్ ఉన్న నయన్.. ఈసారి మాత్రం ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా.. పెళ్లి తంతు ఫినిష్ చేసేసిందని అంటున్నారు.
అక్కడి నుంచే విఘ్నేష్ శివన్ ను స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని చెప్పుకుంటున్నారు. ఒకట్రెండ్ వర్కవుట్ అయ్యాయ్ కూడా. మరి ఇప్పుడు నయన్ చేస్తున్న సినిమాల స్పీడు చూస్తుంటే.. అసలు పెళ్లి సంగతి బయటకు చెబుతుందో.. ఎప్పటికీ చెప్పదో కూడా అర్ధం కావడం లేదని అనిపిస్తోందట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/