మామూలుగా సంక్రాంతి పేరు చెప్పగానే పండగ సందడి గుర్తొస్తుందేమో కానీ.. ఈ సారి మాత్రం నందమూరి వారసుల రేస్ కూడా మెదులుతోంది అందరికీ. ఒక రోజు గ్యాప్ లో బాలకృష్ణ డిక్టేటర్ - ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో చిత్రాలను రిలీజ్ కన్ఫామ్ చేయడంతో.. నందమూరి హీరోల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయని అందరూ ఫిక్స్ అయిపోయారు.
కొన్నేళ్లుగా ఫ్యామిలీకి ఎన్టీఆర్ కి మధ్య దూరం కాస్త పెరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు మొలదయ్యాయని తెలుస్తోంది. రీసెంట్ గా నాన్నకు ప్రేమతో స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియాలో అడుగుపెట్టాడు జూనియర్. వచ్చీ రాగానే ఓ సీనియర్ రాజకీయ నాయుకుడు ఎన్టీఆర్ తో ఇదే విషయంపై మాట్లాడి, కెరీర్ పై ప్రభావం చూపించే నిర్ణయాలను తీసుకోవద్దని సూచించాడట. అంతే కాదు.. బాలకృష్ణతో మాట్లాడించాడని కూడా తెలుస్తోంది. ఎన్టీఆర్ కూడా బాబాయ్ కి ఫోన్ చేశాడు. అయితే ఇద్దరికీ క్లోజ్ అయిన ఓ సీనియర్ నటుడి ఫోన్ ద్వారా బాబాయ్ కి కాల్ చేసి, కొన్ని నిమిషాలపాటు ఇదే విషయంపై మాట్లాడాడని తెలుస్తోంది.
బాబాయ్ అబ్బాయ్ లు మాట్లాడుకున్న ఎఫెక్ట్ తో.. ఇప్పుడు నాన్నకు ప్రేమతో చిత్రం ఓ వారం లేట్ గా రిలీజ్ చేసే అవకాశాలున్నాయని చెబ్తున్నారు. ఈ విషయాన్ని ఆడియో ఫంక్షన్ లో అధికారికంగా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కి పితృవియోగం కారణంగా.. ఇంకా ఈ మూవీ ఆడియో ఫంక్షన్ డేట్ ఫిక్స్ చేయలేదు. ఇదిలా ఉంటే.. డిక్టేటర్ ఆడియో ఫంక్షన్ ను మాత్రం ఏపీ కేపిటల్ అమరావతిలో డిసెంబర్ 20న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.