సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడని, ఆయన పరిస్థితి కాస్త సీరియస్ గానే ఉంది అంటూ గత రెండు మూడు రోజులుగా తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. 2.ఓ చిత్రం విడుదల సమయంలో రజినీకాంత్ అనారోగ్యం బారిన పడటం విచారకరం అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. రజినీ ఆరోగ్యం బాగుండాలని పూజలు కూడా చేశారు. అయితే రజినీకాంత్ అనారోగ్యంపై వస్తున్న వార్తలు పుకార్లే అని తేలిపోయింది.
తాజాగా తన భార్య లత రజినీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఒక ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ సందర్బంగా రజినీకాంత్ పూర్తి ఆరోగ్యంగా - ఎనర్జిటిక్ గా ఉన్నట్లుగా కనిపించాడు. ఎలాంటి సమస్య లేని రజినీకాంత్ హాస్పిటల్ లో ఉన్నాడంటూ ప్రచారం చేసి ఫ్యాన్స్ ను ఆవేదనకు గురి చేయడం ఎందుకంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. రజినీ ఆరోగ్యం గురించి చెత్త వార్తు ఇకపై ఆపండి అంటూ ఫ్యాన్స్ ఆగ్రహంతో మీడియాను హెచ్చరిస్తున్నారు.
రజినీ 2.ఓ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతోంది. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా నటించిన విషయం తెల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులన్నీ కూడా తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.