ఫోటో స్టొరీ: ఆంగ్రియా క్రూజ్ పై ఆరెక్స్ పాప

Update: 2019-02-06 06:12 GMT
ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టాలంటే ఖచ్చితంగా లక్ కొంత ఉండాల్సిందే.  అలాంటి లక్కు పాయల్ రాజ్ పుత్ కు కొంచెం కాదు.. ఎక్కువే ఉంది. అందుకే ఎంట్రీ సినిమాతోనే బ్లాక్ బస్టర్ సినిమా సాధించడమే కాకుండా.. నటనతోనూ.. బోల్డ్ కిస్సులతోనూ ప్రేక్షకులను క్లీన్ బౌల్డ్ చేసింది పాయల్ రాజ్ పుత్.  'RX100' సినిమా సక్సెస్ తో సినిమా ఆఫర్లే కాదు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ కూడా అమ్మడి ఖాతాలో పడుతున్నాయి.

ఈ భామ మిస్సా మోర్ క్లోతింగ్ కు బ్రాండ్ అంబాజిడర్.  దీంతో ఫోటో షూట్ కోసం మాంచి క్రూజ్ ఎక్కి మిస్సా బ్రాండ్ దుస్తులు ధరించి తన హాట్నెస్ ను కాస్త బయటకు తీసింది.  తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ ఫోటో షూట్ వీడియోలను పోస్ట్ చేసింది.  ఈ వీడియోలకు  "నాకు ఇష్టమైన బ్రాండ్స్ లో ఒకటైన మిస్సా మోర్ క్లోతింగ్ కోసం షూటింగ్ లో పాల్గొంటున్నా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ ఫోటో షూట్ ఎక్కడ జరిగిందని అనుకుంటున్నారు?  ముంబై నుంచి గోవాకు వెళ్ళే ఆంగ్రియా క్రూజ్ పై.   అందమైన బోటు.. ఆ బోటులో బ్లాక్ డ్రెస్ లో పాయల్ హీటు.  తెగ రెచ్చిపోయి కెమెరాకు పోజులిచ్చింది.  పాయల్ ఇలా పోజులిస్తే నెటిజనులు ఏమైపోవాలి? అందుకే వాళ్ళకు చేతనైన పని కాబట్టి లైకులు మాత్రం కొట్టారు.  

ఇక ఈ భామ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఈ బ్యూటీ తెలుగులో రవి తేజ కొత్త సినిమా 'డిస్కో రాజా' లో హీరోయిన్ గా ఎంపికైంది.  నాగార్జున 'మన్మధుడు-2' లో కూడా హీరోయిన్ గా పాయల్ పేరును పరిశీలిస్తున్నర.  ఇవి కాకుండా తమిళంలో కూడా ఒక సినిమా సైన్ చేసింది.


Tags:    

Similar News