రైతుబంధు చెక్కులను తిరిగేచ్చేసిన మహేష్

Update: 2018-06-09 07:54 GMT
మహేష్ బాబు మరోసారి ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు ద్వారా తనకిచ్చిన చెక్కును తిరిగి ఇచ్చేశారు. మహేష్ బాబు కుటుంబంతోపాటు నిర్మాత రవిశంకర్ కూడా తనకు వచ్చిన రైతు బంధు చెక్కులను తిరిగి ప్రభుత్వానికి అప్పగించారు. ఈ మేరకు మహేశ్వరం వ్యవసాయాధికారి కోటేశ్వర్ రెడ్డికి రూ.16వేల చెక్కులను అందజేశారు..

పూర్వపు రంగారెడ్డి జిల్లా పరిధిలోని మహేశ్వరం మండలం నాగారం పరిధిలో మహేష్ బాబుకు 39.2 గుంటల భూమి, నమ్రత శిరోద్కర్ పేరిట1.20 ఎకరాలు, నిర్మాత రవిశంకర్ కు రెండు ఎకరాల భూమి ఉంది. శుక్రవారం నమ్రత శిరోద్కర్ , రవిశంకర్ లకు వ్యవసాయాధికారి కోటేశ్వర్ రెడ్డి రైతు బంధు చెక్కులను అందించారు. అందుకున్న వీరు తిరిగి ఆ చెక్కులను ప్రభుత్వానికి అందజేయాలని తిరిగి ఇచ్చేశారు.

శుక్రవారం బంజరాహిల్స్ లోని మహేష్ బాబు నివాసంలో రైతుబంధు చెక్కులను మహేశ్వరం వ్యవసాయాధికారి కోటేశ్వర్ రెడ్డి - వీఆర్వోలు మహేష్ బాబు - నమ్రతలకు అందించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న రవిశంకర్ కు కూడా చెక్కులు ఇచ్చేశారు. ఈ సందర్భంగా నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. ‘రైతు బంధు పథకం  పేద రైతులకు బాగా ఉపయోగపడుతుందని.. రైతుకు 5 లక్షల బీమా పథకం ఆదర్శనీయమని’ కొనియాడారు. మహేష్ బాబు ఫ్యామిలీ తమకు వచ్చిన రైతుబంధు చెక్కులను తిరిగిచ్చేయడంతో వారి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News