సస్పెన్స్ వీడినట్లే కనిపిస్తోంది. నాగచైతన్య కెరీర్లో అత్యంత ముఖ్యమైన రెండు సినిమాల రిలీజ్ డేట్లపై ఓ క్లారిటీ వచ్చేసింది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చైతూ కథానాయకుడిగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఆగస్టు 19న విడుదలవుతుందని సమాచారం. ఇప్పటికే చాన్నాళ్లుగా వాయిదా పడ్డ ఈ సినిమాను ఆగస్టులోనే రిలీజ్ చేయబోతున్నట్లు దర్శకుడు గౌతమ్ మీనన్ వెల్లడించినట్లు తెలుగులో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న కోన వెంకట్ ఈ రోజే క్లారిటీ ఇచ్చాడు. ఆగస్టు 12న ‘బాబు బంగారం’ వస్తున్న నేపథ్యంలో వారం గ్యాప్ ఇచ్చి చైతూ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారట.
ఇక యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో చైతూ నటించిన మలయాళ బ్లాక్ బస్టర్ రీమేక్ ‘ప్రేమమ్’ను సెప్టెంబరు 9న రిలీజ్ చేస్తారట. సెప్టెంబరు 2న ఎన్టీఆర్ మూవీ ‘జనతా గ్యారేజ్’ విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు కూడా వారం గ్యాప్ ఇచ్చి ‘ప్రేమమ్’ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. అంటే 20 రోజుల వ్యవధిలో చైతూ సినిమాలు రెండు ప్రేక్షకుల ముందుకొస్తాయన్నమాట. దోచేయ్ తర్వాత ఏడాది పైగా విరామం తీసుకున్న చైతూ.. ఇలా ఒకేసారి రెండు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించబోతుండటం విశేషమే. మరి ఈ రెండు సినిమాలు అతడికి ఎలాంటి పలితాన్నిస్తాయో చూడాలి.