గతంలో మన టాలీవుడ్ సినిమాలకు మీటర్ ఉండేది. కామెడీ సినిమాలకు ఒక మీటర్.. యాక్షన్ సినిమాలకు మరో మీటర్. ఆ ఫార్మాట్ దాటి ఎవరూ బయటకు వచ్చేవారు కాదు. కానీ తమిళ ఫిలిం మేకర్స్ మాత్రం కొత్తదనం ఉండే సినిమాలతో పాటుగా శృతి మించి మతి చెడేలా పర్వర్ట్ సినిమాలు కూడా తీస్తూ అందరి దృష్టిని ఆకర్షించేవారు. ఇప్పుడు మన టాలీవుడ్ ఫిలిం మేకర్లకు ఆ అలవాటు వచ్చేసింది. కొత్తదనం..బోల్డ్ టచ్ ఉండే సినిమాలు తీసి ప్రేక్షకులపై వదులుతున్నారు. కాస్త ఎబ్బెట్టుగా ఉండే సీన్లు తీయడంలో కూడా జంకడం లేదు.
కొంత కాలం క్రితం 'గ్రా. బంధంరేగడ్' అనే షార్ట్ ఫిలిం కు దర్శకత్వం వహించిన సాహిత్ మోత్కూరి తాజాగా ఒక కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమా ఫస్ట్ లుక్ ను శుక్రవారం మధ్యాహ్నం 2.10 PM కు రిలీఎజ్ చేస్తారట. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక ప్రీ లుక్ ను విడుదల చేశారు. ఈ ప్రీ లుక్కే షాక్ ఇచ్చేలా ఉంది. ఈ ప్రీ లుక్ లో హీరో హీరోయిన్ల తో పాటు ఒక గుర్రం కూడా ఉంది. హీరోయిన్ వెనక్కు తిరిగి కెమెరాను చూస్తోంది. హీరో ఏం చేస్తున్నాడో చెప్పడం కంటే మీరు చూసి తరించడం చాలా మేలు. డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నాడో ఏమో. ఇది ప్రజాస్వామిక దేశం. పక్కన వాడి డ్యాష్ లో వేలు పెట్టకుండా ఉంటే చాలు.. ఇంక ఎక్కడైనా పెట్టుకోవచ్చు.
ఈ ప్రీ లుక్ ను విడుదల చేస్తూ ట్విట్టర్ ద్వారా "మీరు మర్చిపోలేని ప్రయాణం. త్వరలోనే పిచ్చిని చూస్తారుగా" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. పోస్టర్ లో హీరో రగ్డ్ లుక్ లో ఉన్నాడు. నేపథ్యంలో ఉన్న వస్తువులు.. టీవీ వాలకం చూస్తుంటే ఇది పీరియడ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాలా కనిపిస్తోంది. ప్రీ లుక్ తోనే షాక్ ఇస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందో.. టీజర్ ఎలా ఉంటుందో.. ట్రైలర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఈ సినిమాలో నందు హీరోగా నటిస్తున్నాడు. సంతోష్ మోత్కూరి.. నిశాంక్ రెడ్డి కుడితి నిర్మిస్తున్నారు.