ప్రపంచవ్యాప్తంగా `సాహో` ప్రభంజనం గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. డార్లింగ్ ప్రభాస్ నటించిన ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే బెస్ట్ ఓపెనింగుల్ని రాబట్టనుందన్న అంచనాలు వెలువడ్డాయి. పలువురు ట్రేడ్ అనలిస్టుల విశ్లేషణ ప్రకారం సాహో మొదటి రోజు 90 కోట్లు పైగా నెట్ వసూలు చేయనుందన్న ప్రచారం సాగుతోంది. ఇక అమెరికాలో `సాహో` టిక్కెట్టు ధరను 5డాలర్లు అదనంగా పెంచి విక్రయించడంతో ఆ మేరకు రాబడి అనూహ్యంగా పెరిగిందని ట్రేడ్ చెబుతోంది. సాహో ఒక్కో టిక్కెట్టు ధర 30 డాలర్లు గా ఉండడంతో ఆ ప్రభావం కొంతవరకూ ఉన్నా.. ప్రీమియర్లు సహా డే వన్ .. ఓపెనింగ్ వీకెండ్ టిక్కెట్ల సేల్ వేగంగానే సాగుతోందని తెలుస్తోంది.
అమెరికా ప్రీమియర్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అన్నది పరిశీలిస్తే.. ప్రత్యేకించి ఐమాక్స్ షోలు సహా రెగ్యులర్ షో బుకింగ్స్ ద్వారా అన్ని భాషలలో కలిపి $532,727 వసూలైందని తెలుస్తోంది. కేవలం తెలుగు వెర్షన్ ఐమాక్స్ షోలు కలుపుకుని.. రెగ్యులర్ షో బుకింగ్స్ ద్వారా $511,702 వసూళ్లు దక్కాయని రిపోర్ట్ అందుతోంది. కేవలం హిందీ వెర్షన్ కి $16,899.. తమిళ వెర్షన్ కి $4,126 వసూళ్లు దక్కాయి. ఇక అన్ని భాషలలో ఐమాక్స్ షోల వరకు $77418 .. రెగ్యులర్ షో బుకింగ్స్ ద్వారా $455309 వసూళ్లు దక్కాయని తెలుస్తోంది. 5,32,727 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 3.84 కోట్లు. కేవలం ప్రీమియర్ల రూపంలో ఇప్పటికి అందిన సమాచారం ప్రకారం.. ఇంత రేంజు బిజినెస్ చేసింది.
కేవలం అమెరికాలోనే కాదు... ఇండియా సహా వరల్డ్ వైడ్ అన్ని మెట్రో నగరాల్లోనూ టిక్కెట్టు విండో వద్ద ఓపెనింగ్ వీకెండ్ సాహో హవా సాగుతోందని చెబుతున్నారు. ఇండియాలో హైదరాబాద్-చెన్నయ్- బెంగళూరు-పూణే- ముంబై- కోల్ కత- జైపూర్- దిల్లీ తదితర చోట్ల భారీగా డిమాండ్ నెలకొందని ట్రేడ్ చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ టూటైర్ సిటీ పరిధిలో ఆన్ లైన్ టికెటింగ్ జెట్ స్పీడ్ తో పూర్తవుతోంది.