ఇంకొద్ది గంటల్లో డూ ఆర్ డై

Update: 2019-08-29 14:10 GMT
కౌంట్ డౌన్ మొదలైపోయింది. రెండేళ్లు నెలలు అయ్యాయి. నెలలు రోజులుగా మారాయి. ఇప్పుడా రోజులు గంటల్లోకి వచ్చాయి. సాహో విడుదల గురించి ఇప్పుడు దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. ఒక కమర్షియల్ సౌత్ సినిమా ఇంత భారీ ఎత్తున రిలీజ్ చేయడం గురించి అక్కడి టాప్ స్టార్స్ సైతం షాక్ అవుతున్నారు. ఇప్పటికి ఉన్న సమాచారం మేరకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి షో తెల్లవారుఝామున 4 గంటలకు మొదలవుతుంది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ లోని చాలా సెంటర్స్ లో టికెట్ బుకింగ్ కూడా అయిపోయింది. అర్థరాత్రి 1 గంటకు షో ఉండొచ్చనే టాక్ వచ్చింది కానీ పోలీసు శాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో అవి మాత్రం రద్దయ్యాయని వినికిడి.

సో  ఇంకొద్ది గంటలు వెయిట్ చేస్తే సాహో తెరమీదకు వచ్చేస్తుంది. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్ యాప్స్ క్రాష్ అయ్యే రేంజ్ లో టికెట్లను అమ్మేశాయి. కరెంట్ బుకింగ్స్ వద్ద పరిస్థితి దీనికి భిన్నంగా ఏమి లేదు.  ప్రసాద్ ఐమ్యాక్స్ దగ్గర చాంతాడంత క్యూలు ఉదయం నుంచే దర్శనమిచ్చాయి. అన్ని నగరాలూ పట్టణాల్లో ఇదే సీన్ కనిపిస్తోంది. కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టిన బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు సాహో మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు.

బాగుందనే టాక్ వస్తే చాలు బాహుబలి రికార్డులు బద్దలు కావడం ఖాయమనే రీతిలో అంచనాలు ఉన్నాయి. దానికి ఉదయం 4 గంటలకు పడబోతున్న షోలు ప్రధానంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. అసలే సోషల్ మీడియా కాలం. ఎంత వద్దన్నా అత్యుత్సాహంతో సినిమా తాలూకు అప్ డేట్స్ పెట్టకుండా నెటిజెన్లు ఉండలేకపోతున్నారు. సో ఉదయం సూర్యుడు పొద్దుపొడిచే లోపు సాహో రిపోర్ట్స్ వెల్లువెత్తుతాయన్న మాట. మూడు రోజుల దాకా బుకింగ్స్ దాదాపు క్లోజ్ అయిపోయిన పరిస్థితే ప్రతి చోటా కనిపిస్తోంది.

    

Tags:    

Similar News