సాహో టికెట్లు కావాలా ?

Update: 2019-08-07 10:57 GMT
ఈ నెలలో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున సినిమా ఏదీ అంటే చిన్న పిల్లడు కూడా ఠక్కున చెప్పే సమాధానం సాహో. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ యాక్షన్ వండర్ ని చూసేందుకు ప్రతి మూవీ లవర్ రోజులు లెక్కబెట్టుకుంటూ మరీ ఎదురు చూస్తున్నాడు. ఈ ఉత్సుకతకు గమనించి అప్పుడే థియేటర్ల యాజమాన్యాలు ప్రీ బుకింగ్ మొదలుపెట్టేశాయి. అలా అని ఇది అడ్వాన్స్ బుకింగ్ అనుకోకండి. ఇది వేరు.

ఒక టికెట్ కు అదీ వోచర్ రూపంలో 250 రూపాయలు చెల్లిస్తే ఆగస్ట్ 30న సాహో చూసేందుకు మనకు జస్ట్ కన్ఫర్మేషన్ ఇస్తారు. ఊరు థియేటర్ పేరు పేటిఎం యాప్ లో స్పష్టంగా పొందుపరిచారు. అయితే ఇక్కడో మెలిక ఉంది. షో టైం మనకు కోరుకున్న సీటు ఎంచుకునే సౌలభ్యం ప్రస్తుతానికి లేదు. కేవలం ఆ రోజు ఖచ్చితంగా సినిమా చూసే హామీ మాత్రమే ఈ ప్రీ బుకింగ్ ఇస్తుంది

నిజానికి ఇంకా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు రాకుండానే ఇలా 250 రూపాయలకు టికెట్లు అమ్మకానికి పెట్టడం రైటో రాంగో చెప్పలేం కానీ ఆ రోజు దొరుకుతాయో లేదో అన్న అనుమానం ఉన్నవాళ్లు బుక్ చేసుకుంటున్నారు. అధిక శాతం వి సెల్యులాయిడ్ చైన్ థియేటర్లవే కావడం గమనార్హం. కీలక కేంద్రాలైన అనంతపూర్-కర్నూల్ - తిరుపతి లాంటి చోట్ల ఆన్ లైన్ బుకింగ్ రన్ అవుతోంది. బెనిఫిట్ షోలు ఇందులో పొందుపరిచారా అంటే దానికి సంబంధించి మాత్రం స్పష్టత లేదు. పైకి కనిపించకుండానే సాహో ఫీవర్ మెల్లగా మొదలైపోయింది.


Tags:    

Similar News