సుజిత్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'సాహో' ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రోజు ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ ప్రదర్శితమయ్యాయి. ప్రీమియర్ షోల తర్వాత సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ప్రీమియర్స్ కు కూడా అమెరికాలో ఆశించినంత రెస్పాన్స్ రాలేదని ప్రీమియర్ కలెక్షన్స్ ట్రెండ్స్ చూస్తే మనకు అర్థం అవుతుంది.
రాత్రి పదిగంటల వరకూ 'సాహో' చిత్రం అమెరికాలో 'సాహో' అమెరికాలో 290 లోకేషన్స్ నుండి $800,899 కలెక్షన్స్ వసూలు చేసింది. మిగతా లోకేషన్స్ నుండి ఇంకా వివరాలు అందాల్సి ఉంది. అవి కూడా వస్తే వన్ మిలియన్ మార్క్ చేరుకోవడం సాధ్యమేనని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ప్రీమియర్లతోనే వన్ మిలియన్ డాలర్ మార్క్ కు దగ్గరగా రావడం గొప్ప విషయమే కానీ 'సాహో' పై ఉన్న భారీ అంచనాలను బట్టి చూస్తే మాత్రం ఈ కలెక్షన్స్ తక్కువేనని చెప్పాలి. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు భారీగా కలెక్ట్ చేయాల్సి ఉంటుంది.
మరి ఫస్ట్ డే కలెక్షన్స్.. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేదాన్ని బట్టి సినిమా లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేయగలుగుతుందో ఒక అంచనాకు రావచ్చు. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి ఓవర్సీస్ ఆడియన్స్ ఈ సినిమాను ఎలా ఆదరిస్తారో చూడాల్సి ఉంది.