నివేత థామస్.. రెజీనా లు ప్రధాన పాత్రలో రూపొందిన 'శాకిని డాకిని' తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేష్ బాబు సమర్పణలో ఈ సినిమాను సునీత తాటి నిర్మించారు. ఈ సినిమకు మొదట సుధీర్ వర్మ దర్శకత్వం వహించగా.. ఆయన మధ్యలో ప్రాజెక్ట్ ను వీడటంతో బ్యాలన్స్ వర్క్ ను ఆనంద్ రంగతో చేయించిన విషయం తెల్సిందే.
ఇద్దరు దర్శకులు వర్క్ చేసిన ఈ ఇద్దరు హీరోయిన్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతో ఇంత సందడి చేస్తుందని అంతా భావించారు. కానీ అనూహ్యంగా సినిమా కు నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ సినిమా కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ సినిమాకు అధికారిక రీమేక్ అనే విషయం తెల్సిందే. గతంలో వచ్చిన కొరియన్ మూవీ రీమేక్స్ కి మంచి స్పందన వచ్చింది కనుక ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది.
ఇద్దరు కుర్రాళ్లు పోలీస్ ట్రైనింగ్ లో ఉండగా ఒక క్రైమ్ ను ఎలా ఛేదించారు అనే విషయాన్ని మిడ్ నైట్ రన్నర్స్ సినిమాలో చూపించారు. ఇక్కడ హీరోల మల్టీ స్టారర్ సినిమా అంటే కాస్త కష్టమైన విషయం. ఇద్దరు హీరోలను కన్విన్స్ చేయడం అంటే సాధ్యం అయ్యే పని కాదు అనుకున్నారేమో.. అందుకే ఇద్దరు హీరోయిన్స్ తో లేడీ మల్టీ స్టారర్ సినిమాగా ఈ సినిమాను తీసుకు వచ్చారు.
హీరోలు అయితే ఏంటీ.. హీరోయిన్స్ అయితే ఏంటీ మంచి కథ అయితే తప్పకుండా సినిమాను జనాలు చూస్తారని యూనిట్ సభ్యులు భావించారేమో.. అందుకే ప్రయోగం చేశారు. కానీ వ్యూహం బెడిసి కొట్టింది. ఇద్దరు హీరోయిన్స్ మల్టీ స్టారర్ పై పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు.. పైగా సినిమాకు నెగటివ్ టాక్ మొదలయ్యింది.
ఒక వేళ ఈ సినిమా ను ఇద్దరు హీరోలతో చేసి ఉంటే మొదటి నుండే బజ్ క్రియేట్ అయ్యేది. ఇద్దరు హీరోలకు తగ్గట్లుగా కథలో కాస్త కమర్షియల్ టచ్ ఇచ్చి స్క్రీన్ ప్లే నడిపి ఉంటే బాగుండేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హీరోయిన్స్ తో చేసి తప్పు చేశారు అనేది చాలా మంది అభిప్రాయం.