టాలీవుడ్ కి ఎప్పుడూ కూడా కొత్తగా కథానాయికలు పరిచయమవుతూనే ఉంటారు. అయితే ఇటీవల కాలంలో చిన్న సినిమాల సంఖ్య బాగా పెరిగిపోయింది. దాంతో కథానాయికలు పెద్ద సంఖ్యలో పరిచయమవుతున్నారు. తెలుగు తెరకి కొత్త కథానాయికల తాకిడి పెరిగిపోతూ వస్తోంది. ఆనంద్ దేవరకొండ హీరోగా చేస్తున్న 'పుష్పక విమానం' సినిమా గీత్ శైనీ .. శాన్వి మేఘన కథానాయికలుగా పరిచయమవుతున్నారు. నిన్న రాత్రి వైజాగ్ లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శాన్వి మేఘన మాట్లాడింది.
"నాకు వైజాగ్ చాలా స్పెషల్ ... చిన్నప్పుడు నాకు ఇక్కడే డాన్స్ లో ఫస్టు ప్రైజ్ వచ్చింది. ఈ సినిమాలో సుందర్ వైఫ్ మీనాక్షి జంప్ అవుతుంది. కట్టప్ప .. బాహుబలిని ఎందుకు చంపాడు? అన్నట్టుగా .. సుందర్ ని వదిలేసి మీనాక్షి ఎందుకు వెళ్లిపోయింది? అనే విషయాన్ని గురించి అంతా మాట్లాడుకుంటారు. ఈ సినిమాలో నేను 'స్వామిరారా' అనే సాంగ్ కి డాన్స్ చేసే ఛాన్స్ దొరికింది. ఆ సాంగ్ కి డాన్స్ చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. నాకు ఇంతమంచి పాత్రను ఇచ్చినందుకు దర్శకుడు దామోదర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాను.
ఈ సినిమాతో గీత్ కి మంచి పేరు వస్తుంది. ఇక మా చిన్నకొండ గురించి మాట్లాడతాను. 'దొరసాని' వచ్చినప్పుడు నేను కూడా మీ అందరిలాగానే చూశాను. బాగా చేస్తున్నాడని అనుకున్నాను. ఆ తరువాత 'మిడిల్ క్లాస్ మెలోడీస్' వచ్చినప్పుడు స్క్రిప్టులు భలేగా పడుతున్నాడు .. వెరీ నైస్ అనుకున్నాను. ఇక 'పుష్పక విమానం' విషయానికి వస్తే, ఆయన పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టేశాడు. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు .. ఇచ్చిపడేసిండు.
ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే .. ఆయన అందరినీ ఇన్స్పైర్ చేయాలనుకుంటూ ఉంటాడు. తన పైసల్ పెట్టి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆయన సొంత ప్రొడక్షన్ పెట్టడం ఆయన ఎదుగుదలను చెబుతోంది. ఆయన ఈ స్థాయికి రావడానికి కారణం ఆయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్. పాండమిక్ సమయంలో కూడా ఆయన ఎంతోమందికి హెల్ప్ చేశాడు. నిజంగానే విజయ్ చాలా రిచ్ .. డబ్బు విషయంలో కాదు .. మంచి మనసున్న విషయంలో. ఈ ప్రపంచానికి విజయ్ చాలా ఇంపార్టెంట్ .. ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన బన్నీగారికి ఈ వేదిక ద్వారా థ్యాంక్స్ చెబుతున్నాను" అంటూ ముగించింది.