బాలీవుడ్ నటులపై దారుణమైన కామెంట్లు

Update: 2017-02-18 06:13 GMT
సమ ఖబర్.. పాకిస్థాన్ నటి. త్వరలోనే ‘హిందీ మీడియం’ అనే సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేయబోతోంది. ఇర్ఫాన్ ఖాన్ లాంటి ప్రపంచ స్థాయి నటుడి సరసన ఆమె నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్లకు రావాల్సిన సమ.. ఇండియాలోకి అడుగే పెట్టలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. అందుకు కారణం రెండేళ్ల కిందట ఒక పాకిస్థాన్ టీవీ ఛానెల్ షోలో బాలీవుడ్ సూపర్ స్టార్ల మీద ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడమే. అప్పటికి ఆమెకు బాలీవుడ్ సినిమా చేసే ఆలోచన లేదేమో.. తనకు ఇక్కడ అవకాశాలు వస్తాయని కూడా ఊహించలేదేమో.. ఇష్టానుసారం వాగేసింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే ఆమె మెడకు చుట్టుకున్నాయి.

సల్మాన్ ఖాన్ చీప్ నటుడట.. అతడితో సమ నటించదట. అంతే కాదు.. సల్మాన్ ను ‘చిచోరా’ అని కూడా అనేసింది సమ. సీరియల్ కిస్సర్ గా గుర్తింపు పొందిన ఇమ్రాన్ హష్మి మీద అయితే మరీ దారుణమైన కామెంట్లు చేసింది సమ. అతడితో సినిమా చేస్తే నోటి క్యాన్సర్ వస్తుందని.. కాబట్టి అతడితో సినిమా చేయను అంటూ చీప్ కామెంట్స్ చేసింది సమ. హృతిక్ రోషన్ కూడా సమ పక్కన చేయడానికి సరిపోడట. అతడికి ఇద్దరు పిల్లలుండటమే కారణమని.. అతను తనకు సరిపోడని వ్యాఖ్యానించిందామె. రితీష్ దేశ్ ముఖ్ ‘ఎ’ గ్రేడ్ నటుడు కాదని.. తన లాంటి స్టార్ నటికి అతను సరిపోడని కూడా వ్యాఖ్యానించింది సమ. రణబీర్ కపూర్ మీద కూడా ఆమె విమర్శలు గుప్పించింది. రెండేళ్ల కిందటి ఈ వీడియో.. ఇప్పుడు సమ బాలీవుడ్ అరంగేట్రానికి రెడీ అయిన తరుణంలో బయటపడటంతో ఆమెకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఆమె చేస్తున్న సినిమాకు కూడా ఇది ఇబ్బందికర పరిస్థితే. ఆల్రెడీ పాకిస్థాన్ నటీనటులకు వ్యతిరేకంగా ఇండియాలో ఆందోళనలు జరుగుతున్న టైంలో ఈ వీడియో బయటపడటంతో ఇబ్బందులు రెట్టింపయ్యేలా ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News