బండ్ల గణేష్ - సచిన్ జోషి వివాదం గురించి తెలిసిందే. ఆ ఇద్దరూ కలిసి సినిమాలు చేశారు. ఆ తర్వాత ఆర్థిక పరమైన వ్యవహారాల్లో గొడవలు పడి రచ్చకెక్కారు. స్నేహం చెడ్డాక కోర్టు గడప వరకూ వెళ్లారు. ఆ క్రమంలోనే సచిన్ జోషి అంటే ఎవరో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసింది. అతడే హీరోగా నటిస్తూ, అతడే సినిమాలకు పెట్టుబడులు పెడుతూ నిర్మాతగా కొనసాగుతాడని చెప్పుకున్నారు.
నిజానికి శ్రీమంతుడు అనగానే మహేష్ అనో, అంబానీ అనో అనుకుంటే పొరపాటే. `ఒరేయ్ పండు` సచిన్ జోషినే అసలు సిసలైన శ్రీమంతుడు. ముంబైలో బిలియన్ డాలర్ బిజినెస్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేస్తున్న ది గ్రేట్ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కం నిర్మాత అతడు. కరెన్సీ కట్టల మధ్య పెరిగిన సిల్వర్ స్పూన్... గోల్డ్ స్పూన్ బోయ్ అతడు. అపుడెపుడో మానిక్‌చాంద్ గుట్కా కంపెనీ ఓనర్ కొడుకు అని చెప్పుకునేవారు. ఆ తర్వాత సచిన్ బిజినెస్ వ్యవహారాల గురించి తెలిశాక ముక్కున వేలేసుకున్నారు. సచిన్ ముంబైలోనే రిచెస్ట్ పారిశ్రామిక వేత్త జేఎంజే గ్రూప్ ఓనర్ కుమారుడు. ఇన్‌ఫ్రా - హాస్పిటాలిటీ- హోటల్స్ - రియల్ ఎస్టేట్ - ఆల్కహాల్ తయారీ బోట్ రేసింగ్ వంటి రంగాల్లో అతడి ఫ్యామిలీ వ్యాపారాలు ఉన్నాయి. ఇంకా పేర్లు పలకలేని కంపెనీలెన్నో ఉన్నాయి. ఇండియా - స్విట్జర్లాండ్ - దుబాయ్ లాంటి చోట బిజినెస్ లెన్నో. వ్యాపారం వాసన పట్టేయడంలో కింగ్ సచిన్ డాడ్ జె.ఎం.జోషి.
అసలు చదువు అన్నదే లేనివాడు జేఎంజే. జోద్ పూర్-రాజస్థాన్ స్వస్థలం. అక్కడి నుంచి వ్యాపారం కోసం ముంబైకి తరలివచ్చారు. ఆరంభం ఎసెన్సుల బిజినెస్ చేశారు. గరం మసాలా - పొగాకు, - చూయింగ్ గమ్ - అగర్‌బత్తి - షాంపూలు - ఫుడ్ - ఆల్కహాల్ లో ఎన్నో ఎసెన్సులు కనిపెట్టారు. మానిక్ చంద్ - గోవా - వాజిర్ - వంటి వాటని వీళ్లే కనిపెట్టారు. ఏ చదువు లేకుండానే ఎంటర్ ప్రెన్యూర్ అయ్యాడు సచిన్ జోషి తండ్రి జేఎంజే. ఆ తర్వాత ఆ వ్యాపారాల్ని పుత్రరత్నం సచిన్ జోషి ఫ్యామిలీతో కలిసి ముందుకు తీసుకెళుతున్నాడు. అయితే మానిక్ చంద్ అనే గుట్కా వ్యాపారి కొడుకు సచిన్ అనే జనాలకు తెలుసు. ఇదే విషయం పై సచిన్ ఇదివరకూ ఇంటర్వ్యూల్లో వివరణ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ఫిట్‌నెస్ రంగంలో బిజినెస్ చేస్తున్నారు. బిగ్ బ్రదర్ ఫౌండేషన్ చూస్తుంటాడు. రూరల్ ఏరియాల్లో ఫైనాన్సియల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ లాంటి కొత్త వ్యవస్థను కనిపెట్టింది వీళ్లేనట. ఇక వీటన్నిటి నడుమ సినిమా వ్యాపారం అన్నది చాలా చిన్న పార్ట్. ఎంటర్ టైన్‌మెంట్ అనేది టైమ్ పాస్ కోసం చేసే బిజినెస్ మాత్రమేనన్నది సచిన్ సన్నిహితులు చెప్పే మాట. ఇక తమ సొంత రాష్ట్రం అయిన రాజస్థాన్‌లో 300 బెడ్ క్యాన్సర్ హాస్పిటల్ కట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. ఇదేగాక బోలెడన్ని సామాజిక సేవలు చేస్తున్నారు. వీటన్నిటితో పాటు సచిన్ జోషి దుబాయ్‌లోనూ అదిరిపోయే బిజినెస్ చేస్తున్నాడట. అక్కడ రియల్ రంగంలో పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఎంతో కలర్‌ఫుల్ గా ఉండే దుబాయ్ బోట్ రేసింగ్ - ఫిషింగ్ యాచ్ బిజినెస్‌లోనూ పెట్టుబడులు పెట్టారట. అక్కడ యాచింగ్ బోట్స్ రెంటల్ & వెండర్ విజినెస్‌ని చేస్తున్నారట. ప్రస్తుతం సచిన్ జోషి- రైనా జోషి సంయుక్తంగా నిర్మించిన `నెక్ట్స్ ఏంటి?` రిలీజ్‌కి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో సన్నిహితుల నుంచి ఈ సంగతులన్నీ తెలిశాయి.