అలనాటి అందాల తార సావిత్రి బయోపిక్ ‘మహానటి’ సినిమా నుంచి ఒక్కో బిట్ వదులుతూ... క్రేజ్ ను పెంచుతున్నారు చిత్ర యూనిట్. సావిత్రి వేషధారణలో ఉన్న కీర్తి సురేష్ లుక్- మధురవాణిగా నటిస్తున్న సమంత- విజయ్ దేవరకొండ- దుల్కర్ సల్మాన్ లుక్స్ విడుదల చేసి సినిమాపై క్యూరియాసిటీని పెంచిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఒక్కో పాటను విడుదల చేస్తూ... క్లాసిక్ టచ్ రుచిని చూపిస్తోంది.
నిన్న ‘సదా నన్ను నడిపే నీ చెలిమే...’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. శాస్త్రీయ పాటలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రముఖ గాయని చారులతా మణి ఈ పాటను ఆలపించారు. క్లాసిక్ మెలోడిగా సాగే ఈ పాటకు ప్రాణం పోసింది ఆమె గొంతు. శ్రావ్యమైన గొంతుతో ఓ రకమైన శాస్త్రీయ సంగీత ప్రపంచంలోకి తోసేసే ఈ పాటకు స్వర కర్త మిక్కి జే. మేయర్. ఓ రకంగా ఈ పాటకు అందించిన ట్యూన్స్ తో వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాని గుర్తు చేశాడు మిక్కీ. లిరికల్ వీడియోలో చూపించిన స్టిల్స్ ఆధారంగా ఈ పాట సమంత- విజయ్ దేవరకొండల మధ్య వస్తుందని అర్థమవుతుంది. మరీ క్లాసీగా ఉన్న ఈ సాంగ్ ఇప్పటి తరానికి ఎంత నచ్చుతుందనేది సందేహమే. అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ ఎంట్రీ అప్పుడు వచ్చిన కీర్తనల్లా బహుశా బ్యాక్ గ్రౌండ్ లో మాత్రమే వినిపించే అవకాశం ఉందేమో!
సిరివెన్నెల సీతారామశాస్త్రీ గారు రాసిన ఈ పాట ‘మహానటి’ సినిమా ఎలా ఉండబోతుందో మరోసారి స్పష్టం చేసింది. ఎటువంటి కమర్షియల్ హంగులు లేకుండా పూర్తిగా క్లాసిక్ ఫేవర్ మిస్ కాకుండా సావిత్రి జీవితాన్ని తెరమీద ఆవిష్కరించబోతున్నాడు దర్శకుడు నాగ ఆశ్విన్.
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View