ప్రేమకు కొత్త లెక్కలు చెబుతున్న మెగా హీరో

Update: 2020-07-24 10:30 GMT
మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ గతంలో ఒక హీరోయిన్‌ తో ప్రేమలో ఉన్నాడు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత మరో హీరోయిన్‌ పేరు కూడా ప్రచారం జరిగింది. అయితే ఆ ఇద్దరు హీరోయిన్స్‌ తో తాను ప్రేమలో లేడు అంటూ క్లారిటీ ఇచ్చాడు. వారు తనకు మంచి స్నేహితులు మాత్రమే అన్నాడు. తాజా ఇంటర్వ్యూలో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రేమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిలేషన్‌ షిప్‌ లో తాను లేకపోవడానికి గల కారణంను విచిత్రమైన లెక్కలు వేసి చెప్పాడు.

రిలేషన్‌ లో ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా వారి కోసం 75 శాతం సమయంను కేటాయించాలి. అలా కేటాయించలేకుంటే ఇబ్బంది తప్పదు. అంత సమయం నేను కేటాయించడం సాధ్యం కాదు. అందుకే నేను ప్రేమలో పడాలనుకోవడం లేదు. ప్రస్తుతం నా బిజీ షెడ్యూల్‌ కు రిలేషన్‌ షిప్‌ పెట్టుకుంటే గందరగోళం అవ్వడం ఖాయం. అందుకే రిలేషన్‌ షిప్‌ పై ఆసక్తిగా లేనంటూ సాయి ధరమ్‌ తేజ్‌ వ్యాఖ్యలు చేశాడు. రిలేషన్‌ షిప్‌ ఆసక్తి లేదన్న తేజు పెళ్లి పై ఎలాంటి ఉద్దేశ్యంతో ఉన్నాడనేది తెలియాల్సి ఉంది.

త్వరలో సాయి ధరమ్‌ తేజ్‌ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ చిత్రం విడుదలైతే దేవాకట్టా దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు. ఇప్పటికే దేవా కట్టా మూవీ ప్రారంభం అయ్యింది. కాని కరోనా కారణంగా సినిమా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. ఈ ఏడాది చివరి వరకు పరిస్థితులు చక్కదిద్దబడితే సోలో బ్రతుకే సోబెటర్‌ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత తేజ్‌ కొత్త సినిమా హడావుడి మొదలయ్యే అవకాశం ఉంది.


Tags:    

Similar News