ఆ ఫోటో చూసి షాక్ అయ్యాను

Update: 2017-11-27 17:31 GMT
రీసెంట్ గా టాలీవుడ్ ని ఒక్కసారిగా షేక్ చేసిన ఫొటో ఏదైనా ఉందా అంటే రాజమౌళి ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక ఫొటోనే అని చెప్పాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి రాజమౌళి తో నవ్వుతూ ఉండడం అందరిని ఆకట్టుకుంది. మొదట అందరు ఎదో క్యాజువల్ గా ఫొటో దిగారులే అనుకున్నారు. కానీ ఆ తర్వాత అసలు విషయం తెలిసాక అందరు షాక్ అయ్యారు. ముగ్గురు కలిసి ఓ భారీ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తున్నారని త్వరలో భారీ మల్టి స్టారర్ రాబోతోందని తెలియగానే అభిమానులు ఎంజాయ్ చేశారు.

అయితే రీసెంట్ గా సాయి ధరమ్ తేజ్ కూడా ఆ విషయంపై స్పందించాడు. జవాన్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఓక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజు.. ఆ మల్టి స్టారర్ గురించి మాట్లాడుతూ.. నేను కూడా ముందు వారి ఫొటో చూసినప్పుడు నమ్మలేదు. ఎదో క్యాజువల్ గా పార్టీ చేసుకొని ఫొటోకి స్టీల్ ఇచ్చారేమో అనుకున్నా కానీ నా ఫ్రెండ్ ఫోన్ చేసి ప్రాజెక్ట్ చేస్తున్నారాని చెప్పడంతో షాక్ అయ్యాను. వెంటనే చరణ్ కి కాల్ చేయడంతో నిజమని తెలియగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.

ఇద్దరు స్టార్ హీరోలు ఒక గ్రేట్ డైరెక్టర్ సినిమా తీయడం అంటే నిజంగా ప్రతి ఒక్కరికి హ్యాపీగానే ఉంటుంది అని ఆ సినిమా కోసం చాలా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్. 
Tags:    

Similar News